అందాన్ని రెట్టింపు చేసే గ్రీన్ టీ.. ఇలా వాడితే మచ్చలేని మృదువైన‌ చర్మం మీ సొంతం!

గ్రీన్ టీ( Green Tea ).దీని గురించి ప్రత్యేక‌మైన ప‌రిచ‌యాలు అవసరం లేదు.

వ‌ర‌ల్డ్ వైడ్ గా అత్యధికంగా సేవించే పానీయాల్లో గ్రీన్ టీ ఒకటి.ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలని ట్రై చేస్తున్న వారు తప్పకుండా తమ డైట్ లో గ్రీన్ టీ ఉండేలా చూసుకుంటారు.

వెయిట్ లాస్( Weight Loss ) తో సహా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు గ్రీన్ టీ ద్వారా పొందవచ్చు.అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు అందాన్ని రెట్టింపు చేయడానికి కూడా గ్రీన్ టీ ఉపయోగపడుతుంది.

Use Green Tea Like This For Spotless Smooth Skin, Green Tea, Green Tea Benefits

ముఖ్యంగా గ్రీన్ టీను ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే మచ్చలేని మృదువైన మెరిసే చర్మం మీ సొంతమవడం ఖాయం.మరి ఇంకెందుకు ఆలస్యం గ్రీన్ టీను చర్మ సౌందర్యానికి( Skin Glowing ) ఎలా వాడాలో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.

Advertisement
Use Green Tea Like This For Spotless Smooth Skin!, Green Tea, Green Tea Benefits

వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు గ్రీన్ టీ ఆకులు( Green Tea Leaves ), రెండు లెమన్ స్లైసెస్ వేసుకుని వాటర్ సగం అయ్యేంత వరకు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చల్లార బెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు నీరు తొలగించిన పెరుగును వేసుకోవాలి.అలాగే నాలుగు టేబుల్ స్పూన్లు గ్రీన్ టీ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు పూతలా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని సున్నితంగా రెండు నిమిషాల పాటు బాగా రబ్ చేసి.

అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రంగా వాష్ చేసుకోవాలి.

Use Green Tea Like This For Spotless Smooth Skin, Green Tea, Green Tea Benefits
న్యూస్ రౌండప్ టాప్ 20

రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే చర్మంపై ఒక్క మచ్చ కూడా ఉండదు.స్కిన్ గ్లోయింగ్ గా షైనీ గా మెరుస్తుంది.ముడతలు ఏమైనా ఉంటే దెబ్బకు పరార్ అవుతాయి.

Advertisement

చర్మం బిగుతుగా, మృదువుగా మారుతుంది.వయసు పైబడిన కూడా చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.

కాబట్టి మచ్చలేని కాంతివంతమైన చర్మాన్ని( Spotless Skin ) కోరుకునే వారు తప్పకుండా గ్రీన్ టీతో ఈ సింపుల్ రెమెడీని పాటించండి.

తాజా వార్తలు