Henry Doorley : యూఎస్ జూ: ఎలిగేటర్ పొట్ట నుంచి 70 నాణేలు వెలికితీత.. ఇలా మింగేసిందేంటి…

యూఎస్‌లోని హెన్రీ డోర్లీ ( Henry Doorley )అనే జూ, అక్వేరియంలో నివసిస్తున్న ఒక ఎలిగేటర్ ఏకంగా 70 నాణేలు మింగి అందరికీ షాక్ ఇచ్చింది.

థిబోడాక్స్ అని పిలుచుకునే ఈ ఎలిగేటర్‌కు 36 ఏళ్లు ఉన్నాయి.

అయితే కొద్ది రోజులుగా అది తీవ్రమైన కడుపు నొప్పితో అల్లాడిపోతోంది.ఏమైందని పరిశీలించగా దాని కడుపులో నాణేలు ఉన్నట్లు తెలిసింది.

దాంతో షాక్ అవడం వైద్యుల వంతయ్యింది.జూ సందర్శకులు ఇది నివసించే చోట నాణేలు విసిరేయడం, అవి ఆహార పదార్థాలు అనుకోని ఇది మింగేయడం జరిగిందని తర్వాత జూ సిబ్బంది అర్థం చేసుకున్నారు.

జూ సిబ్బంది ఈ జంతువు ప్రాణాలు పోకుండా నాణేలను త్వరగా బయటకు తీయాలని నిర్ణయించుకున్నారు.జూ వైద్యురాలు డాక్టర్ క్రిస్టినా ప్లూగ్( Dr.Christina Plueg ) ఆపరేషన్ చేశారు.జంతువులపై నాణేలు విసరడం చాలా చెడ్డదని, అలా ఎవరు ఎప్పుడు చేయకూడదని ఆమె విజ్ఞప్తి చేశారు.

Advertisement

డాక్టర్ ప్లూగ్ థిబోడాక్స్‌ ఎలిగేటర్‌కు( alligator ) మత్తుమందు ఇచ్చి, నోటిలో ఒక ట్యూబ్‌ని పెట్టారు.నాణేలను కనుగొని తీసివేయడానికి కెమెరా, కొన్ని సాధనాలను ఉపయోగించారు.

వాటన్నింటినీ బయటకు తీసేశానని నిర్ధారించుకోవడానికి చివరగా ఎక్స్-రే చిత్రాన్ని తీశారు.

థిబోడాక్స్ మత్తు నుంచి మేల్కొన్న తర్వాత చాలా ఉపశమనంగా ఫీల్ అయింది.మరో జంతుప్రదర్శనశాల వైద్యులు డాక్టర్ టేలర్ యా మాట్లాడుతూ, ఈ ఆపరేషన్ చాలా అరుదు అని తెలిపారు.జంతువులను ఎంత బాగా చూసుకుంటున్నామో ఈ ఆపరేషన్ చెప్పకనే చెబుతుందన్నారు.

మూగ జంతువులను బాధ పెట్టకుండా ఉండడానికి జూ సందర్శకులు విచక్షణతో ప్రవర్తించాలని కూడా కోరారు.వాటిపై నాణేలు ఎందుకు విసిరారు తెలియరాలేదని, అలాంటి పని ఎవరు చేయకూడదని విజ్ఞప్తి చేశారు.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

ఈ ఎలిగేటర్‌కు సంబంధించిన ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు