అమెరికాలోనే హెచ్ 1 బీ వీసా రెన్యువల్ .. దరఖాస్తు ఎలా, భారతీయులు ఏం చేయాలంటే..?

హెచ్‌ 1 బీ వీసాకు( H1B visa ) సంబంధించి అమెరికా ప్రభుత్వం ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

హెచ్ 1 బీ వీసా పునరుద్ధరణ కార్యక్రమాన్ని మరింత సులభతరం చేసేందుకు గాను చర్యలు చేపట్టింది.

దీనిలో భాగంగా కొన్ని కేటగిరీలకు చెందిన హెచ్ 1బీ వీసాలను దేశీయంగానే రెన్యువల్‌ చేసుకునేలా ప్రయోగాత్మకంగా ఓ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది.తొలి విడతగా 20 వేల మందికి వీసా రెన్యువల్ చేయనుండగా.

ఈ అవకాశం మొదట భారతీయులు, కెనడియన్లకు మాత్రమే దక్కింది.ఈ మేరకు యూఎస్ ఫెడరల్ రిజిస్ట్రీ తమ నోటీసుల్లో తెలిపింది.

అయితే ఈ ప్రోగ్రామ్‌కు ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? కార్యక్రమం ఎప్పటి నుంచి అమలవుతుంది.? దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూస్తే .అమెరికాలోనే హెచ్ 1 బీ వీసా రెన్యువల్ ప్రోగ్రామ్‌ జనవరి 29 నుంచి ప్రారంభంకానుంది.2024 జనవరి 29 నుంచి ఏప్రిల్ 1 వరకు హెచ్ 1 బీ వీసాదారులు తమ వీసాలను యూఎస్‌లో వుండే రెన్యువల్ చేసుకోవచ్చు.ప్రతివారం 4 వేల చొప్పున అప్లికేషన్ స్లాట్‌లు అందుబాటులో వుండగా.

Advertisement

ఇందులో 2 వేలు భారతీయుల కోసం కేటాయించనున్నారు.జనవరి 29, ఫిబ్రవరి 5, ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 19, ఫిబ్రవరి 26వ తేదీల్లో ఈ స్లాట్‌లు అందుబాటులో వుంటాయని ఫెడరల్ ప్రభుత్వం తెలిపింది.

అలాగే వీసా రెన్యువల్ కోసం దరఖాస్తులు, సంబంధిత పత్రాల సమర్పణ, రాతపూర్వక వివరణకు ఏప్రిల్ 15, 2024 వరకు గడువు విధించారు.జనవరి 1 2020 నుంచి .2023 ఏప్రిల్ 1 మధ్య కెనడా ప్రభుత్వం( Government of Canada ), 2021 ఫిబ్రవరి 1 నుంచి 2021 సెప్టెంబర్ 30 మధ్య భారత ప్రభుత్వం జారీ చేసిన వీసాలకు మాత్రమే ప్రస్తుతం రెన్యువల్ చేసుకునేందుకు వీలు కల్పించారు.

https://travel.state.gov/content/travel/en/us-visas/employment/domestic-renewal.html తో పాటు www.regulations.gov వెబ్‌సైట్‌లో దరఖాస్తులను సమర్పించవచ్చు.రెన్యువల్ కోసం దరఖాస్తుదారులు 205 డాలర్లు (భారత కరెన్సీలో రూ.17 వేలు) చెల్లించాల్సి వుంటుంది.అలాగే గతంలో వీసా అప్లికేషన్ సమయంలో 10 వేలిముద్రలను సమర్పించి వుండాలి.

వ్యక్తిగత ఇంటర్వ్యూ మినహాయింపు కోసం అర్హులై వుండాలి.దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఆమోదం లభించిన, ఎక్స్‌పైర్ కానీ హెచ్ 1 బీ పిటిషన్‌ను కలిగి వుండాలి.

భగ్గుమంటోన్న బ్రిటన్.. అప్రమత్తంగా ఉండండి : భారతీయులకు కేంద్రం అడ్వైజరీ
టాలీవుడ్ టాప్ స్టార్స్ ఫస్ట్ క్రష్ ఎవరిపైనో తెలుసా?

అమెరికాలోనే ఎందుకు వీసా రెన్యువల్ :హెచ్ 1 బీ వీసా కలిగిన వారు తమ వీసా రెన్యువల్ , స్టాంపింగ్ సేవల కోసం వారి సొంత దేశానికి వెళ్లాల్సి వుంటుంది.ఆయా దేశాల్లో వున్న అమెరికా దౌత్య కార్యాలయాల్లో ఈ సేవలు లభిస్తాయి.అయితే ఇందుకోసం దరఖాస్తుదారులు నెలల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది.

Advertisement

ఈ ఇబ్బందులను పరిగణనలోనికి తీసుకున్న అమెరికా ప్రభుత్వం ఇలాంటి వారికి ఊరట కలిగేలా తాజా నిర్ణయం తీసుకుంది.

తాజా వార్తలు