ఉక్రెయిన్‎లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పర్యటన..!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆకస్మాతుగా ఉక్రెయిన్ కు వెళ్లారు.ఈ క్రమంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో జో బైడెన్ పర్యటిస్తున్నారు.

కాగా రష్యా యుద్ధం మొదలుపెట్టాక ఆయన తొలిసారిగా ఉక్రెయిన్ కు రావడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.ఈ క్రమంలో పర్యటనకు వచ్చిన బైడెన్ కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్వాగతం పలికారు.

అనంతరం ఇరువురు సమావేశమై పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.సుమారు ఐదు వందల మిలియన్ డాలర్ల మిలటరీ సహాయ ప్యాకేజీని ఉక్రెయిన్ కు అందజేయనున్నట్లు జో బైడెన్ వెల్లడించారు.

ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?
Advertisement