మైనేలో పర్యటించిన బైడెన్ దంపతులు.. తుపాకీ కాల్పుల్లో మరణించిన వారికి నివాళి

అమెరికాలోని మైనేలో( Maine ) ఇటీవల ఓ దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 18 మంది దుర్మరణం పాలైన ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.

మైనేలోని లెవిస్టన్‌లో గల బార్ అండ్ రెస్టారెంట్, బౌలింగ్ అలే వద్ద అక్టోబర్ 25 బుధవారం రాత్రి 7 గంటల సమయంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి.

రద్దీగా వున్న ప్రాంతానికి సెమీ ఆటోమేటిక్ రైఫిల్ తీసుకున్న దుండగుడు ప్రవేశించి.విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు.

దీంతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు.నిందితుడిని గతంలో యూఎస్ మిలటరీలో పనిచేసిన రిజర్వ్ సభ్యుడు రాబర్ట్ కార్ట్‌గా( Robert Card ) పోలీసులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్,( Joe Biden ) జిల్ బైడెన్( Jill Biden ) దంపతులు శుక్రవారం లూయిస్టన్‌, మైనేలోని ఘటనాస్థలిని సందర్శించి మృతులకు నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.

Advertisement

తాము మీకు అండగా వుంటామన్నారు.దేశంలో ప్రబలంగా విస్తరిస్తోన్న తుపాకీ హింసను అరికట్టడానికి చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ విషయమై డెమొక్రాట్లు , రిపబ్లికన్ల మధ్య ఏకాభిప్రాయం సాధ్యమవుతుందన్నారు.మన పిల్లలను, మన కుటుంబాలను, మన సమాజాలను రక్షించడానికి సహేతుకమైన, బాధ్యాతయుతమైన చర్యల గురించి ఆలోచిస్తామని అధ్యక్షుడు తెలిపారు.

ఈ దాడి నుంచి కోలుకోవడం చాలా కాలం కష్టమేనని.లెవిస్టన్‌కు( Lewiston ) అడుగడుగునా మద్ధతు ఇవ్వడానికి ఫెడరల్ ప్రభుత్వం కట్టుబడి వుందని బైడెన్ హామీ ఇచ్చారు.నిలిచిపోయిన తుపాకీ భద్రత చట్టంపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ను కోరతానని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు.అమెరికాలో గన్ కల్చర్‌కు( Gun Culture ) సంబంధించి ఎన్నో సర్వేలు చేదు నిజాలు చెబుతున్నాయి.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

దేశంలో నిత్యం ఏదో ఒక మూల జరిగే కాల్పుల ఘటనల్లో కనీసం 53 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారట.అంతేకాదు.

Advertisement

అమెరికాలో జరిగే హత్యల్లో 79 శాతం తుపాకీ కాల్పుల ద్వారానే జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

చిన్నారులు బొమ్మ తుపాకీలు కొనుక్కున్నంత తేలిగ్గా అక్కడ గన్‌లు దొరుకుతున్నాయి.దేశంలో నేరాలకు ఆయుధాలే అసలు కారణమని 50 ఏళ్ల క్రితమే అప్పటి అమెరికా అధ్యక్షుడు లిండన్ బైనెస్ జాన్సన్ చెప్పారంటే ఆయన ముందుచూపును అర్ధం చేసుకోవచ్చు.అప్పట్లోనే అమెరికా ప్రజల వద్ద 9 కోట్లకుపైగా ఆయుధాలున్నాయట.మరి గడిచిన 50 ఏళ్లలో వీటి సంఖ్య ఏ స్థాయిలో పెరిగి వుంటుందో ఊహించడం కూడా కష్టమే.2018 నాటి లెక్కల ప్రకారం అమెరికన్ల వద్ద 39 కోట్ల ఆయుధాలున్నాయని అంచనా.

తాజా వార్తలు