బాత్ మ్యాట్స్ పై హిందూ దేవుళ్ళు..అమెరికా కంపెనీ తలపొగరు

అమెరికాలో హిందుత్వంపై మరో సారి దాడి జరిగింది.

గతంలో అమెజాన్ వంటి ఈ కామర్స్ దిగ్గజం హిందూ దేవుళ్ళ బొమ్మల్ని టాయిలెట్ మ్యాట్ పై చిత్రీకరించి అమ్మకానికి పెట్టగా దీనిపై దేశవ్యాప్తంగా రచ్చ రచ్చ జరిగింది దాంతో క్షమాపణలు చెప్తూ వెంటనే వాటిని తొలగించింది.తాజాగా అమెరికాలో ఇలాంటి ఘటనే జరిగింది.అమెరికాలోని బాస్టన్‌కు చెందిన వేఫెయిర్ కంపెనీ ఇలాగే బాత్ మ్యాట్స్‌పై హిందూ దేవుళ్ల ఫొటోలను ప్రింట్ చేసి వివాదంలో చిక్కుకుంది.

వేఫెయిర్ కంపెనీ తాము విక్రయించే గృహోపకరణలపై హిందూ దేవుళ్ళ ఫోటోలని ముద్రించింది.హిందూ దేవుళ్ళు అయిన శివుడు.వినాయకుడు బొమ్మలతో బాత్ మ్యాట్ లని రూపొందించింది.

అంతేకాదు తన స్టోర్ లో అమ్మకానికి కూడా పెట్టి , ఒక్కో మ్యాట్ ధరని 38 డాలర్లు కే పేర్కొంది.అలాగే ఆన్‌లైన్‌లో కూడా వీటిని అందుబాటులో ఉంచింది.

ఈ మ్యాట్స్ కి "యోగా ఏసియన్ లార్డ్ విత్ థర్డ్ ఐ బాత్ రగ్ బై ఈస్ట్ అర్బన్ హోమ్", "ఏసియన్ ఫేస్ ఆఫ్ ఎలిఫెంట్ లార్డ్ బాత్ రగ్" అనే పేర్లతో విక్రయానికి పెట్టింది.

ఇలా హిందూ దేవుళ్ళ బొమ్మలని మ్యాట్స్ పై ముద్రించడంతో అది కాస్తా తెలిసి సదరు కంపెనీపై వింర్సాలు వెల్లివెత్తాయి.గతేడాది కూడా ఇదే సంస్థ కటింగ్ బోర్డులపై గణేషుడి బొమ్మలను ముద్రించి విమర్శలు ఎదుర్కుంది.దాంతో హిందూ కార్యకర్తలు వెంటనే వాటిని నిలిపివేయాలని ఆందోళన చేయడంతో చివరికి క్షమాపణలు చెప్పి విరమించింది.

సిక్కు కమ్యూనిటీతో ప్రధాని నరేంద్ర మోడీది బలమైన బంధం : ఇండో అమెరికన్ నేత

తాజా వార్తలు