OTT Theater Movies : ఈ వారం ఓటిటి థియేటర్ లో రిలీజ్ అవ్వబోతున్న సినిమాలు, సిరీస్ లు ఇవే?

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు విడుదల అవుతున్నాయి.కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదల అవుతుండగా మరికొన్ని సినిమాలు ఓటీటీ లో విడుదల అవుతున్నాయి.

అయితే ఇదివరకు థియేటర్లలో కేవలం రెండు మూడు సినిమాలు మాత్రమే విడుదల కాగా ఈ మధ్యకాలంలో ఒకేసారి నాలుగైదు సినిమాలు విడుదల అవుతున్నాయి.మరి ఈ వారం ఓటీటీ లో అలాగే థియేటర్లలో ఏ ఏ సినిమాలు విడుదల కానున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సంగీత తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన మసూద సినిమా 18 న విడుదల కానుంది.ఈ సినిమాకు సాయికిరణ్ దర్శకత్వం వహించగా రాహుల్ యాదవ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్, గెహన సిప్పి ప్రధాన పాత్రలో నటించిన గాలోడు సినిమా ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇందులో సప్తగిరి షకలక శంకర్ పృథ్వీరాజ్ తదితరులు కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే.

Advertisement

రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.అలాగే ఎన్ రావన్ రెడ్డి, శ్రీ నిఖిత ప్రధాన పాత్రల్లో నటించిన అలిపిరికి అల్లంత దూరంలో సినిమా ఈనెల 18న విడుదల కానుంది.

ఈ సినిమాకు ఆనంద్ జే దర్శకత్వం వహించగా రమేష్ దబ్బు గొట్టు, రెడ్డి రాజేంద్ర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.ఇందులో అలంకృతా షా, రవీంద్ర బొమ్మ కంటి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అలాగే రణధీర్, నందిని రెడ్డి కలిసి నటించిన తాజా చిత్రం సీతారామపురం లో ఒక ప్రేమ జంట సినిమా ఈనెల 18వ తేదీన విడుదల కానుంది.

వినయ్ బాబు దర్శకత్వం వహించగా బీసు చందర్ గౌడ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.అలాగే దృశ్యం 2 సినిమా కూడా 18వ తేదీన విడుదల కానుంది.ఇందులో అజయ్ దేవగన్, టబు, శ్రియ, అక్షయ్ కన్నా తదితరులు కీలక పాత్రలు నటించారు.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

ఈ సినిమాకు అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించగా భూషణ్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్, కృష్ణకుమారుడు నిర్మాతలకు వ్యవహరించారు.అహనా పెళ్ళంట అనే వెబ్ సిరీస్ ఈ నెల 17న జీ 5లో స్ట్రీమింగ్ కానుంది.

Advertisement

ఇందులో రాజ్ తరుణ్ శివాని రాజశేఖర్ లో ప్రధాన పాత్రల్లో నటించగా ఆమని, పోసాని మురళీకృష్ణ, హర్షవర్ధన్ తదితరులు కీలకపాత్రలో నటించారు.సంజీవరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా సాయిదీప్ రెడ్డి బుర్ర సూర్య రాహుల్ తమాడ నిర్మాతలుగా వ్యవహరించారు.

రాశి కన్నా, కార్తీ కలిసి నటించిన సర్దార్ సినిమా ఈనెల 18వ తేదీ నుంచి ఆహాలో స్త్రీమింగ్ కానుంది.మెగాస్టార్ చిరంజీవి,నయనతార, సల్మాన్ ఖాన్ సత్యదేవ్ లు తెలిసినటించిన గాడ్ ఫాదర్ సినిమా ఈనెల 19వ తేదీన నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

తాజా వార్తలు