11 ఏళ్లు ఎంతో అద్భుతమైన క్షణాలు...ఉపాసన పోస్ట్ వైరల్!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ (Ram Charan) ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఇలా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఈయన నటించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.వృత్తి పరమైన జీవితంలో సక్సెస్ సాధించినటువంటి రామ్ చరణ్ వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా ఉన్న విషయం మనకు తెలిసిందే.

ఇక రామ్ చరణ్ ఉపాసన(Upasana) ను వివాహం చేసుకొని తన వ్యక్తిగత జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు.అయితే వీరి వివాహం జరిగి జూన్ 14వ తేదీకి 11 సంవత్సరాలు కావడం విశేషం.

రామ్ చరణ్ ఉపాసనల వివాహం జూన్ 14, 2012 వ సంవత్సరంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.ఇక ఈ దంపతులు 11 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడిపారు.అయితే పెళ్లి జరిగిన పది సంవత్సరాలకు ఈమె పిల్లల గురించి ఆలోచించి ప్రస్తుతం పిల్లలను ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

ప్రస్తుతం ఉపాసనా 8 నెలల ప్రెగ్నెంట్(Pregnant) అనే సంగతి మనకు తెలిసిందే.ఇకపోతే జూన్ 14 వీరి 11 వ వివాహ వార్షికోత్సవం(Wedding Anniversary) కావడంతో ఎంతో ఘనంగా వీరి వివాహ వార్షికోత్సవ దినోత్సవాన్ని జరుపుకున్నారు.

ఇక సోషల్ మీడియా వేదికగా అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇలా జూన్ 11వ తేదీ తమ పెళ్లి రోజు కావడంతో ఉపవాసన సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఈ సందర్భంగా ఆమె ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.గడిచిన 11 సంవత్సరాలు చాలా అద్భుతమైన క్షణాలు అంటూ చేస్తున్నటువంటి ట్వీట్ వైరల్ అవుతుంది.

ఇలా ఈ ట్వీట్ చేస్తూ ఈమె తన భర్త రామ్ చరణ్ తో చాలా రొమాంటిక్ గా దిగినటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఉల్లి తొక్కలతో ఊడిపోయే జుట్టుకు ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసా?

ఇక రాంచరణ్ సినిమాల విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం శంకర్ (Shankar)దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజెర్ (Game Changer)సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు