చరణ్ తో ఆ హీరోయిన్ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది.. ఉపాసన సంచలన వ్యాఖ్యలు!

రామ్ చరణ్,( Ram Charan ) ఉపాసన( Upasana ) ల గురించి మనందరికీ తెలిసిందే.

ఈ జంటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఉపాసన రాంచరణ్ భార్య గానే కాకుండా అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ గా మ్యాగజైన్ ఎడిటర్ గా ఫుల్ బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఇక రామ్ చరణ్ హీరోగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు చెర్రీ.ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్( Game Changer ) మూవీలో నటిస్తున్నాడు.

ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

Advertisement

ఎవరైనా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే చాలు రామ్ చరణ్, ఉపాసనలు ఆదుకోవడానికి జంట ముందుంటుంది.ఇద్దరిదీ చాలా మంచి మనసు అంటూ పరిశ్రమ మొత్తం కొనియాడుతుంటుంది.ఈ జంటకు వివాహమైన 11 సంవత్సరాల తర్వాత క్లింకార( Klin Kaara ) అనే అమ్మాయి జన్మించిన విషయం తెలిసిందే.

ఇకపోతే రామ్ చరణ్ విషయానికి వస్తే హీరో అంటే మామూలుగా ఇండస్ట్రీలో అందరూ హీరోయిన్లతో కలిసి ఉండటంతో పాటుగా అందరితో నటించాల్సి వస్తూ ఉంటుంది.అందరితో ఎంతో స్నేహంగా మెసలుకుంటారు.

అయితే తన భర్తతో నటించి హీరోయిన్లందరిలో ఉపాసనకు మాత్రం తమన్నా( Tamanna ) అంటే చాలా ఇష్టమని ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.

రామ్ చరణ్ తో తమన్నా కెమిస్ట్రీ చాలా బాగుంటుందని, తనకెంతో ఇష్టమని ఉపాసన తెలిపింది.ప్రస్తుతం ఉపాసన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.స్క్రీన్ పై వారిద్దరినీ చూస్తే తనకు బాగా నచ్చుతుందని మా ఆయన పక్కన తమన్నానే చాలా బాగుంటుందని అని వ్యాఖ్యానించింది ఉపాసన.

కెనడా : భారత సంతతి యువతి మరణంపై ముగిసిన దర్యాప్తు.. ఏం తేల్చారంటే?
Advertisement

తాజా వార్తలు