చరణ్ దర్గాకు వెళ్తే తప్పేంటి... భర్తకు అండగా నిలిచిన ఉపాసన?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) ఇటీవల అయ్యప్ప మాల వేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా మాల వేసుకున్న రామ్ చరణ్ ఎంతో నియమనిష్టలను పాటిస్తారు అయితే తాజాగా చరణ్ కడప దర్గాకు( Kadapa Darga ) వెళ్లిన విషయం మనకు తెలిసిందే.

ఇలా ఈయన అయ్యప్ప మాల ధరించి కడప దర్గాను దర్శించుకోవడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.దర్గా అంటేనే అక్కడ సమాధిని దర్శించుకోవడం అలాంటిదే అయ్యప్ప మాల ధరించి రామ్ చరణ్ దర్గాకు వెళ్లడం ఏంటి అంటూ కొంతమంది హిందూ సంఘాలు ఈయన వ్యవహార శైలిని తప్పుపట్టాయి.

ఇలా రామ్ చరణ్ దర్గా వెళ్లడంతో ఈ విషయం గురించి సోషల్ మీడియాలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూ రామ్ చరణ్ వ్యవహార శైలి పట్ల కామెంట్లు చేస్తున్నారు.ముఖ్యంగా ఈయన ఏఆర్ రెహమాన్( AR Rahman ) చెప్పడంతోనే వచ్చానని చెప్పగా మీరు కూడా వెళ్లి ఆయనని తిరుపతికి రమ్మని చెప్పండి వస్తారేమో చూద్దాం అంటూ రాంచరణ్ పై విమర్శలు చేశారు.ఇలా రామ్ చరణ్ కడప దర్గాని దర్శించుకోవడం పట్ల విమర్శలు రావడంతో ఉపాసన ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా ఉపాసన( Upasana ) రాంచరణ్ కడప దర్గాలో ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు.ఇక ఈ ఫోటోని షేర్ చేసిన ఈమె.విశ్వాసం ఏకం చేస్తుంది అది ఎప్పటికీ విడిపోదు భారతీయులుగా మనం దేవుడికి సంబంధించిన అన్ని మార్గాలను ఎంతో గౌరవిస్తాము.మన బలం ఎల్లప్పుడు ఐక్యతలోనే ఉంటుంది రామ్ చరణ్ ఎప్పుడూ కూడా తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలను కూడా గౌరవిస్తూ ఉంటారు.

Advertisement

వన్ నేషన్ వన్ స్పిరిట్ జై హింద్ అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.ఇక ఈ పోస్ట్ వెనుక రామ్ చరణ్ కు ఈమె పూర్తి మద్దతు తెలపడమే కాకుండా తన భర్త అయ్యప్ప మాలలో దర్గాకు వెళ్తే తప్పేంటి అంటూ కూడా పరోక్షంగా అందరిని ప్రశ్నిస్తూ తన భర్తకు పూర్తి సపోర్ట్ చేశారనే చెప్పాలి.

చేసేవి గుడి వెనక పనులు చెప్పేవి వివేకానంద సూక్తులు.. వారికి కౌంటర్ ఇచ్చిన ఆది?
Advertisement

తాజా వార్తలు