అత్త తన మేకప్‌ వాడుతోందని విడాకులు కోరిన యూపీ మహిళ..

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు( Agra ) చెందిన ఓ మహిళ విచిత్రమైన కారణంతో విడాకులను కోరుతూ అందర్నీ విస్తు గొలిపేలా చేస్తోంది.

ఆమె తన అనుమతి లేకుండా తన మేకప్ ఉత్పత్తులను అత్త వాడుకుంటుందని చాలా రోజులుగా బాధపడుతోంది.

తన మేకప్ ప్రొడక్ట్స్( Makeup Products ) వాడవద్దని అత్తయ్యకు ఎంత చెప్పినా మారడం లేదని ఆమె తెగ ఫీల్ అయిపోయింది.చివరికి ఈ సమస్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆమె ఎనిమిది నెలల క్రితమే పెళ్లి చేసుకుంది.తన భర్తతో కలిసి మల్పురాలో ఉన్న అత్త ఇంట్లో కాపురం పెట్టింది.

మొదట్లో ఈ అత్త కోడళ్ళు బాగా కలిసిపోయారు.కానీ తర్వాత, ఆమె అత్త తన మేకప్ ఉత్పత్తులను తీసుకొని తన కోసం ఉపయోగించడం ప్రారంభించింది.

Advertisement

ఆమె తన కోసం ఎలాంటి మేకప్ వదలలేదు.ఇంట్లో ఉన్నా కూడా తన అత్తకు ( Mother-In-Law ) మేకప్ వేసుకోవడం ఇష్టమని ఆమె చెప్పింది.

ఇది నచ్చక మల్పురా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.ఆమె చేసిన పనిని భర్తకు( Husband ) చెప్పింది అత్త.దీంతో ఆగ్రహించిన అతడు ఆమెను దుర్భాషలాడాడు.

ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టాడు.వారు తమ తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వెళ్ళవలసి వచ్చింది.

రెండు నెలలుగా అక్కడే నివాసం ఉంటున్నారు.ఆదివారం ఆ మహిళ, అత్తతో కలిసి పరివార్ పరమర్ష్ కేంద్రం అనే కౌన్సెలింగ్ సెంటర్‌కు వెళ్లింది.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
ఓవరాక్షన్ చేసిన పోలీస్.. ట్రక్ డ్రైవర్‌ ఇచ్చిన ట్విస్ట్‌కి పరార్.. (వీడియో)

అమిత్ గౌర్ అనే కౌన్సెలర్ వారికి సహాయం చేయడానికి ప్రయత్నించాడు.ఆ మహిళ తన భర్తకు విడాకులు( Divorce ) ఇవ్వాలనుకుందని చెప్పాడు.మేకప్ సమస్య ఒక్కటే కారణం కాదని, తన భర్త తనను శారీరకంగా కూడా హింసించాడని చెప్పింది.

Advertisement

అతను ఎప్పుడూ తన తల్లి మాట వింటాడని, తన మాట వినడు అని ఆమె ఆరోపించింది ఈ కాగా ప్రస్తుతం వీరి కేసు హాట్ టాపిక్ గా మారింది.

తాజా వార్తలు