Jayasudha Kakarla Pudi Rajendra Prasad : జయసుధ మొదటి భర్త నుంచి బయపడి పారిపోయి ఎక్కడ తలదాచుకుంది ?

జయసుధ కు రెండు పెళ్లిళ్లు జరిగాయనే విషయం అందరికి తెలిసిందే.ఈ రెండు పెళ్లిళ్ల విషయంలో ఆమె అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ప్రేమ, పెళ్లి ఆమెకు కలిసి రాలేదని చెప్పాలి.తొలి వివాహం ఆమె కెరీర్ లో పీక్ లో ఉన్న సమయంలోనే జరిగింది.

జయసుధ మొదట భర్త వడ్డే నవీన్ తండ్రి అయినా వడ్డీ రమేష్ కి స్వయానా భావ మరిది కాకర్ల పూడి రాజేంద్ర ప్రసాద్.వడ్డే రమేష్ నిర్మాణం లో జయసుధ ఒక సినిమా చేస్తున్న సమయంలో ఆమె రాజేంద్ర ప్రసాద్ తో ప్రేమలో పడింది.

వీరి పెళ్లి కి ఆమె కుటుంబ సభ్యులు ఎవరు ఒప్పుకోలేదు.ఒకరకంగా వీరిది రహస్య వివాహమే.

Advertisement

అతి తక్కువ మంది సమక్షంలో రామ నాయుడు వంటి వారి ఆశీర్వాదం తో విజయవాడలో పెళ్లి చేసుకున్నాడు.పెళ్లయ్యాక న్యూస్ ఆ నోటా ఈ నోటా తెలిసి పేపర్ లో వచ్చి అంతటా తెలిసింది.

ఇక వ్యాపార వేత్త అయినా రాజేంద్ర ప్రసాద్ సినిమా ఇండస్ట్రీ లో పని చేసే వ్యక్తుల స్వభావాలను సరిగ్గా అర్ధం చేసుకోలేకపోయాడు.అందుకే పెళ్లయ్యాక జయసుధ సినిమాల్లో నటిస్తాను అంటే మొదట్లో ఒప్పుకున్నా ఆ తర్వాత చిన్న విషయాలకే గొడవలు పడటం, అనుమానించడం, చెయ్యి కూడా చేసుకోవడం వంటివి చేసేవాడు.

దాంతో అతడితో విసుగు చెందిన జయసుధ ఒకరోజు చెప్పా పెట్టకుండా అతడి ఇంట్లో నుంచి పారి పోయి వచ్చి విజయ వాహిని స్టూడియో లో తల దాచుకుంది.

ఇక దాసరి లాంటి వారు మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నించారు.రాజేంద్ర ప్రసాద్ ని వాహిని స్టూడియో కి పిలిపించి సయోధ్య కుదిరించే ప్రయత్నం చేసారు.రాజేంద్ర ప్రసాద్ అమాయకంగా నటించి జయసుధ ను తీసుకువెళ్లాలని అని అనుకున్న అందుకు ఆమె ఒప్పుకోలేదు.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

దాంతో చేసేదేం లేక ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు.ఆ తర్వాత నితిన్ కపూర్ ని మరోమారు ప్రేమించి పెళ్లాడిన అతడు ఆ మధ్య కాలంలో అపార్ట్మెంట్ పై నుంచి దూకి చనిపోయాడు.

Advertisement

ప్రస్తుతం ఆమె సింగల్ గానే ఉంటుంది.జయసుధ ఇద్దరు కుమారులు.

తాజా వార్తలు