జయమాలినిని కత్తితో బెదిరించిన అగంతకుడు.. తర్వాతేం చేశాడో తెలిస్తే..?

సినిమా హీరోయిన్లు, ఐటమ్ డ్యాన్సర్లను ప్రేక్షకులు చాలా ఇష్టపడతారు.వారికి స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్స్ ఉంటారు.

ఇప్పుడంటే మీడియా, సోషల్ మీడియా, అలాగే వివిధ ఫంక్షన్ల ద్వారా సెలబ్రిటీలు అభిమానులతో ముచ్చటించడం జరుగుతుంది.కానీ ఒకప్పుడు సినిమా వాళ్లను వెండితెరపై తప్ప మరో చోట చూసే ఛాన్స్ ఎవరికీ రాకపోయేది.

అప్పట్లో పత్రికలు తప్ప మరో మాధ్యమం లేదు.అందుకే ఓన్లీ తెరపై కనిపించే తమ అభిమాన తారలు ఒక్కసారిగా అనుకోకుండా బయట కనిపిస్తే ఫ్యాన్స్ కు చాలా ఆనందం కలిగేది.

ఇక ఐటమ్‌ గర్ల్స్ అయిన జ్యోతిలక్ష్మీ, జయమాలిని, సిల్క్‌ స్మిత వంటి వారిని కలిస్తే కలిగే ఆనందం వర్ణనాతీతం.ఒకసారి జయమాలినిని ఓ యువ అభిమాని అనుకోకుండా కలిశాడు.

Advertisement

తర్వాత అతడు రియాక్ట్ అయిన తీరే చాలామందికి ఆందోళన కలిగించింది.ముఖ్యంగా జయమాలినిని.

జ్యోతిలక్ష్మీ, జయమాలి( Jayamalini)ని కనిపిస్తే స్టూడియోల్లో, లేదంటే ఇంటి దగ్గర కనిపించేవారు.ఆమె ఔట్‌డోర్‌ షూటింగ్స్‌కు వెళ్లడం చాలా తక్కువ.సినిమా, ఇతర కార్యక్రమానికి కూడా వెళ్లేవారు కాదు.

కానీ ఎక్కడైనా మనీ వస్తుందంటే పర్ఫామెన్స్‌లు ఇవ్వడానికి వెళ్లేవారు.అలానే ఒకసారి జయమాలిని ఒక ఊరిలో డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చేందుకు వెళ్లింది.

అక్కడ ఆమె సినిమాల్లోలాగా కాకుండా భరతనాట్యం చేసింది.కానీ ఓ ఐటమ్‌ గర్ల్‌ను తీసుకొచ్చి ఇలాంటి డాన్స్‌ చేయిస్తారా అని చాలామంది గోల చేశారు.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
టమాటాలు ఇలా తింటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే!!

సినిమా పాటలకు డ్యాన్స్‌ చేయమని ఇబ్బంది పెట్టారు.స్టేజ్‌ పైకి వచ్చే ప్రయత్నం చేస్తుండటంతో ఈవెంట్ నిర్వాహకులు అప్రమత్తమయ్యారు.

Advertisement

జయమాలిని సన్నిహితులు కూడా వెంటనే రంగంలోకి దిగ ఆమెను జాగ్రత్తగా కారులో ఎక్కించి హోటల్‌ రూమ్‌కి తరలించడం మొదలుపెట్టారు.అయితే అక్కడి జనం ఆమెను వదిలిపెట్టలేదు.కారు వెనుకే వస్తూ హోటల్‌కి కూడా వచ్చి షాక్ ఇచ్చారు.

అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఒక యువకుడు చేతిలో కత్తి పట్టుకొని దూసుకొచ్చాడు.అతడి చేతిలో కత్తి చూసి అందరూ హడలి పోయారు.

ఆ యువకుడు ‘నేను జయమాలిని రూమ్‌కి వెళుతున్నాను.నాతోపాటు ఎవరైనా వచ్చారంటే పొడిచి చంపేస్తాను’ అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు.

అంతటితో ఆగకుండా జయమాలిని రూమ్‌లోకి దూసుకుపోయాడు.ఆమె ఆ యువకుడిని చూసి భయంతో వణికి పోయింది.

ఆమె పక్కనే ఉన్న వారు కూడా గట్టిగా అరి చేశారు.అప్పుడు ఆ యువకుడు ‘ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.

నేనేం చేయను, కేవలం జయమాలినిని చూడ్డానికే ఇలా వచ్చాను.జనాలని బెదిరించడానికి ఈ కత్తి తీసుకు వచ్చాను.

" అంటూ చెప్పుకుంటూ పోయాడు.తర్వాత జయమాలినిని తన దగ్గరకి రమ్మని పిలిచాడు.

భయం భయంగానే ఆమె కొంచెం ముందుకు జరిగింది.అప్పుడు కాసేపు ఆమెను చూసి ‘మిమ్మల్ని దగ్గరగా చూడాలనేదే నా కోరిక ఇప్పుడు అది తీరిపోయింది.

’ అని చెప్పి ఆమె రూమ్ నుంచి వేగంగా వెళ్ళిపోయాడట.తర్వాత పోలీసులొచ్చి పరిస్థితిని కంట్రోల్ చేశారు.

ఈ ఘటన తర్వాత ఆమె బయట ఎప్పుడూ కూడా డాన్స్ పెర్ఫార్మెన్స్ లు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు.ఆ ఘటన ఆమెను అంతలా భయపెట్టింది మరి.

తాజా వార్తలు