తెలుగు హీరోలో లేని కొన్ని అరుదైన క్వాలీటీస్ ఉన్న నటుడు విజయ్ కుమార్

ఈ సంక్రాంతి కి చాల మంది హీరోలు తమ తమ సినిమాలతో బరిలోకి దిగుతున్నారు.

అందులో తమిళ నాట రెండు క్రేజీ ఫిలిమ్స్ తెలుగు లో రెండు క్రేజీ ఫిలిమ్స్ ఉండగా, మన రెండు తెలుగు సినిమాలకు పోటీగా తమిళ చిత్రాలు డబ్బింగ్ చేయబడి వస్తున్నాయి.

బరిలో ఉన్న రెండు సినిమాల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు.చిన్న పిల్లాడిని అడిగిన చెప్పేస్తారు అవి బాలయ్య బాబు వీర సింహ రెడ్డి మరియు చిరంజీవి వాల్తేరు వీరయ్య అని.

ఇక తమిళ్ లో ఇద్దరు స్టార్ హీరోలు ఇదే తరహా లో పోటీ పడుతున్నారు.వారు విజయ్ మరియు అజిత్.

వీరిద్దరికి తెలుగు లో కూడా మంచి గుర్తింపు ఉంది.అందుకే ఈ సంక్రాంతి తమిళనాడు తో పాటు తెలుగు లో విజయ్ వారసుడు అంటూ వస్తుండగా, అజిత్ తెగింపు అంటూ దూకుతున్నాడు.

Advertisement

ఇప్పుడు ఈ నాలుగు హీరోల గురించి, వారి చిత్రాల గురించి, బాక్స్ ఆఫీస్ ఫైట్ గురించి చాల వార్తలు వస్తున్నాయి.అందులో బాగా నన్ను ఆకర్షించిన ఒక విషయం ఈ ఆర్టికల్ లో మీతో పంచుకోబోతున్నాను.

అదేంటంటే తమిళనాడు లో విజయ్ కుమార్ దళపతి గా చాల ఫెమస్.ఆయనకు కోట్లల్లో అభిమానులు ఉన్నారు.

కానీ ఎవరైనా హీరో నుంచి స్టార్ హీరో అయ్యారంటే అందుకు ఎంతో కష్టపడాలి.

దర్శకుల హీరోల, అభిమానుల హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతల హీరోగా కూడా మారాలి.ఆలా విజయ్ కుమార్ కి మంచి పేరు కూడా ఉంది.ఇంకా కాస్త లోతుల్లోకి వెళితే విజయ్ లో చాల మందికి తెలియని అద్భుతమైన క్వాలిటీస్ కూడా ఉన్నాయ్.

వావ్‌ : ఒక్క ఆసనంతో ఇన్ని ఉపయోగాలా?

సినిమా సెట్స్ అందరికన్నా ముందే ఉండటం, అలాగే అయన సెట్ లోకి వచ్చాక సాయంత్రం షూట్ అయ్యే వరకు కూడా అక్కడే ఉంటారు.

Advertisement

ఆయనకు సంబందించిన సీన్స్ ఉన్న లేకపోయినా దర్శకుడికే ఆ రోజంతా అందుబాటులో ఉంటూ మొబైల్ ఫోన్ కూడా వాడక పోవడం గమనించాల్సిన విషయం.అలాగే ఆయనకు మన టాలీవుడ్ లో స్టార్ హీరోలకు ఉన్నట్టు కోట్లకు కోట్లు పెట్టి వ్యానిటి వాన్ లేదా క్యారవాన్ వాడే అలవాటు కూడా లేదు.చాల సింపుల్ గా ఉంటారు.

సెట్ లో కూడా ఎవరితో ఎక్కువ మాట్లాడారు.చాల సైలెంట్ గా ఉంటారు.

ఎంతో అంకితభావం తో పని చేసే అత్యంత తక్కువ మంది హీరోల్లో విజయ్ కుమార్ ఒకరు.

తాజా వార్తలు