హీరోగా ఓడిపోయాడు.. ప్రొడ్యూసర్ గా గెలిచాడు..

మనం ఎంచుకున్న మార్గంలో విజయం సాధించనప్పుడు.కొత్త మార్గంలో విజయం సాధించాలి.

ఇలాగే ఆలోచించి సక్సెస్ అయ్యాడు నారాయణరావు.

అద్భుత నటనతో ఆకట్టుకున్నా.

దక్కాల్సిన గౌరవం దక్కని వారితో తను కూడా ఒకడు.సూపర్ డూపర్ సినిమాల్లో నటించినా.

ఆయన కెరీర్ అంత సజావుగా ముందుకు సాగలేదు.నటుడిగా ఆయనకు మంచి పేరు వచ్చింది.

Advertisement

అంతులేని కథ సినిమాలో తాళికట్టు శుభవేళ అనే పాటలో ఆయన నటించిన తీరు అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది.ఈ సినిమా కనీవినీ ఎరుగని రీతిలో విజయం సాధించడంతో నిర్మాతలకు హాట్ కేక్ లా మారిపోయాడు.

అప్పట్లో స్టార్ హీరోలతో పోటీ పడి నటించాడు నారాయణరావు.కొద్ది కాలం తర్వాత ముత్యాల పల్లకి, అంగడి బొమ్మ సహా పలు సినిమాల్లో ఆయన హీరోగా నటించాడు.కానీ ఆ రెండు సినిమాలు బాగా ఆడలేదు.

ఈ రెండు సినిమాల దెబ్బకు అంతకు ముందుతున్న పేరంతా గంగలో కలిసింది.అవకాశాలు దక్కలేదు.

స్టార్ హీరోగా ఎదుగుతాడు అనుకున్న నారాయణరావు.చిన్న చిన్న పాత్రల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితికి చేరుకున్నాడు.

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ హెచ్చరిక..!!
10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!

ఈ ఇబ్బందులు పడటం కంటే సినిమా రంగాన్ని వదిలి వెళ్లడం మంచిది అనుకున్నాడు నారాయణరావు.అప్పటికి ఇండస్ట్రీలోకి కొత్త రక్తం రావడంతో నారాయణ రావును అందరూ మర్చిపోయారు.

Advertisement

తనకు అవకాశాలు రాకపోవడమే ఆయన జీవితానికి మంచి చేసింది.తన కెరీర్ ఇబ్బందులకు గురి కావడం మూలంగానే ఆయన మరింత బలంగా మరో రూపంలో సక్సెస్ అయ్యాడు.ఎవరో తనకు అవకాశాలు ఇవ్వడం ఏంటి? నేను నలుగురికి అవకాశాలు ఇస్తా అనే స్థాయికి చేరాడు.ఆ తర్వాత నిర్మాతగా మారిపోయాడు నారాయణరావు.

తను నిర్మించిన సినిమాలన్నీ వరుసగా విజయం సాధించాయి. తిరుగులేని నిర్మాతగా మారిపోయాడు.

ఎందరో కొత్త నటీనటులకు అవకాశాలు కల్పించాడు.సక్సెస్ ఫుల్ సినిమాలను నిర్మించాడు.

నటుడిగా విఫలం అయిన నారాయణ రావు.నిర్మాతగా ఎనలేని కీర్తి సంపాదించాడు.

ఒక పరాజయం.మరో విజయానికి మూలం అనేది నారాయణ రావు జీవితంలో నిరూపితం అయ్యింది.

తాజా వార్తలు