ముస్లింలు కొలిచే కృష్ణుడు అవతారం ఏమిటో తెలుసా?

మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అని చెబుతారు.ఇక్కడ కులమతాలకు అతీతంగా ప్రజలందరూ ప్రముఖ దేవాలయాలలో సందర్శిస్తుంటారు.

ఈ క్రమంలోనే మన దేశంలో ఉన్న ఎంతో అద్భుతమైన చారిత్రాత్మక ఆలయాలను సందర్శించడం కోసం విదేశీయులు ఎక్కువగా వస్తుంటారు.ఈ క్రమంలోనే వేములవాడ రాజన్న ఆలయం,కడప వెంకటేశ్వర స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున ముస్లిం భక్తులు చేరుకొని స్వామి వారిని పూజిస్తుంటారు.

అచ్చం ఇలాంటి ఆలయమే రాజస్థాన్ లోని ఒక హిందూ ఆలయంలో దేవుడు ముస్లింల చేత పూజలందుకుంటున్నాడు.రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ప్రాంతాన్ని 14 వ శతాబ్దంలో తోమర్‌ రాజవంశీయులు పరిపాలించేవారు.

ఆ వంశంలో అజ్మల్‌‌కు జైసల్మేర్ యువరాణి మినాల్‌దేవితో వివాహం జరిగింది.అయితే, వీరికి పుత్రసంతానం లేకపోవడంతో తర్వాత వారి వంశ వారసులు లేరని ఎంతో చింతించే వాడు.

Advertisement
Unknown Facts Of Ramsha Pir Temple In Rajasthan, Ramsha, Rajastan, Muslim, Kris

ఈ క్రమంలోనే రాజు తన ఇష్టదైవమైన శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్లి తన బాధనంతా చెప్పుకొనేవాడు.ఆలయంలోని కృష్ణుడి విగ్రహం ముందు రాజు ఏడుపు విని విసిగిపోయిన పూజారి ఎంతో కోపంతో నీ ఏడుపేదో సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరానికి వెళ్లి ఏడిస్తే ఫలితం ఉంటుంది అని చెప్పాడు.

పూజారి చెప్పిన మాట నిజమేనని నమ్మిన ఆ రాజు.సముద్రంలో ఈతకొట్టుకుంటూ మునిగిపోయిన ద్వారకను చేరుకున్నాడు.

Unknown Facts Of Ramsha Pir Temple In Rajasthan, Ramsha, Rajastan, Muslim, Kris

అజ్మల్ భక్తికి మెచ్చిన కృష్ణుడు ఆయనకు దర్శనమిచ్చి, స్వయంగా తానే తమ వంశాంకురంగా జన్మిస్తానని వరం ప్రసాదించాడు.కొన్నాళ్లకు అజ్మల్‌ భార్యకు వీరామ్‌దేవ్‌, రామ్‌దేవ్‌ అని ఇద్దరు కుమారులు జన్మించారు.రామ్‌దేవ్‌ చిన్నతనం నుంచి అలౌకిక శక్తులను ప్రదర్శించేవాడు.

ఈతని మహిమలు చూసి పోఖ్రాన్ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేసేవారు.ఈక్రమంలోనే రామ్దేవ్ మహిమల గురించి అతి తక్కువ కాలంలోనే చుట్టుపక్కల గ్రామాలకు వ్యాప్తి చెందడంతో అందరూ అతని దగ్గరికి వచ్చి వారికి కావాల్సినవి తీసుకునేవారు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

ఈ విధంగా ఎంతో మహిమలు కలిగిన రామ్ దేవ్ ముప్పై మూడు సంవత్సరాలకి భాద్రపద శుక్ల ఏకాదశి రోజున మరణించాడు.సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణ భగవంతుడు తన వంశంగా జన్మించాడని భావించిన వారు అప్పటి నుంచి రామ్ దేవ్ సమాధిని పెద్ద ఎత్తున పూజిస్తారు.

Advertisement

అప్పటినుంచి ముస్లింలు శ్రీకృష్ణ భగవంతుడిని రామ్ షా పీర్ గా పూజించడం ఆనవాయితీగా వచ్చింది.

తాజా వార్తలు