లెజెండరీ యాక్టర్స్ ఎన్టీఆర్‌ జగ్గయ్య మధ్య స్నేహం గురించి ఎవరికి తెలియని విషయాలు

ఎన్టీఆర్, జగ్గయ్య తెలుగు సినిమా పరిశ్రమకు దొరికిన ఆణిముత్యాలు.ఎన్టీఆర్ స్థాయిలో కాకపోయినా జగ్గయ్య సైతం అద్భుత నటనతో తిరుగులేని నటుడిగా గుర్తింపు పొందాడు.

కంచుకంఠం లాంటి ఆయన గొంతుకే జగ్గయ్యకు పెద్ద ఆస్తిగా చెప్పుకోవచ్చు.శివాజీ గణేషన్ లాంటి దిగ్గజ నటుడికి తెలుగులో ఆయనే గాత్రదానం చేశాడు.

అయితే తెగులు సినిమా చరిత్రలో నిలిచిపోయే ఎన్టీఆర్, జగ్గయ్యకు దగ్గరి సంబంధం ఉంది.ఇంతకీ అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.

ఆంధ్రప్రదేశ్ లోని తెనాలికి ఎనిమిది మైళ్ల దూరంలో ఉంటుంది జగ్గయ్య ఊరు.పేరు మెరంపూడి.గుంటూరు ఏసీ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశాడు.

Advertisement
Unknown Facts About Sr Ntr And Jaggayya, Nandamuri Taraka Ramarao, Jaggayya, Rav

అదే సమయంలో దేశాభిమాని అనే పత్రికలో పనిచేశాడు.ఆ తర్వాత ఆంధ్రా రిపబ్లిక్ అనే వార పత్రికకు సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహించాడు.

కాలేజీలో చదువుతున్న సమయంలోనే మంచి నాటకాలు వేసేవారు.వాహిని స్టూడియోలో సౌండ్ డిపార్ట్ మెంట్ లో పని చేసిన శివరాం అప్పుడు ఏసీ కాలేజీలో పనిచేసేవాడు.

వీరంతా కలిసి నాటకాల్లో నటించేవారు.ప్రతి ఏడాది ఏసీ కాలేజీకే ప్రథమ బహుమతి వచ్చేది.

ఈ నాటకాలన్నింటిలోనూ జగ్గయ్య కీలక పాత్ర పోషించేవాడు.ఆ తర్వాత సినిమా రంగంలోకి వచ్చి మంచి నటుడిగా గుర్తింపు పొందాడు.

Unknown Facts About Sr Ntr And Jaggayya, Nandamuri Taraka Ramarao, Jaggayya, Rav
చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

అటు బీఏ పాసయ్యాక.దుగ్గిరాల బోర్డు హైస్కూల్లో బీఈడీ అసిస్టెంట్ గా జగ్గయ్య చేరాడు.చేసేది టీచర్ జాబ్ అయినా నాటకాలు మర్చిపోయేవాడు కాదు.

Advertisement

అప్పటికే విజయవాడలో ఉంటున్న ఎన్టీఆర్ తో కలిసి జగ్గయ్య ఓ నాటక సంస్థను స్థాపించాడు.దాని పేరు రవి ఆర్ట్ థియేటర్.

అటు ఎన్టీఆర్, జగ్గయ్య కలిసి పలు నాటకాలు వేశారు.వీరి నాటకాలకు చక్కటి బహుమతులు వచ్చేవి.

అప్పటి నుంచి మొదలైన వారి స్నేహం సినిమా రంగంలొకి వచ్చాక కూడా కొనసాగింది.ఈ ఇద్దరు కలిసి పలు సినిమాల్లోనూ నటించారు.

వీరిద్దరు క్లాస్ మేట్స్ కావడం మరో విశేషం.మొత్తంగా ఈ ఇద్దరు నటులు తెలుగు సినిమా పరిశ్రమలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

తాజా వార్తలు