ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ రేస్ లో ఎంతో స్పీడ్ గా దూసుకుపోతుంది కృతి శెట్టి.
ఉప్పెన అనే సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.
ఇక దర్శక నిర్మాతలందరూ చూపును కూడా ఈ అమ్మడు ఆకర్షించింది.ఇంకేముంది ఈ అమ్మడికి వరుసగా అవకాశాలు రావడం మొదలైంది.
అంతేకాదు కృతి శెట్టి నటించిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు లాంటి సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి.ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమా నుంచి వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించిన హీరోయిన్ గా రికార్డు సృష్టించింది కృతి శెట్టి.
ఇక వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.ఇటీవలే రామ్ సరసన వారియర్ అనే సినిమాలో నటించింది అన్న విషయం తెలిసిందే.
ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ సినిమా ఆశించిన ఫలితం మాత్రం ఇవ్వలేకపోయింది.ప్రస్తుతం సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
ఇకపోతే మనందరికీ తెరమీద ఎంతో అందంగా కనిపించే కృతి శెట్టి కి సంబంధించిన ఎవరికీ తెలియని 5 నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా కృతిశెట్టి కి కోపం అనేది రాదట.ఒకవేళ అతికష్టం మీద ఎప్పుడైన కోపం వస్తే ఎవరితో ఏం మాట్లాడకుండా సైలెంట్ గా తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని హాయిగా నిద్ర పోతుందట.
2.ఎంతో మంది హీరోయిన్లు ఎమోషనల్ సన్నివేశాలలో గ్లిజరిన్ వాడతారు.కానీ ఎవరైనా గట్టిగా అరిచినా గొడవపడిన కూడా ఇట్టే కన్నీళ్లు వచ్చే వస్తాయట.అదే తన బలహీనత అని కూడా చెబుతూ ఉంటుంది.3.కృతి శెట్టి సెంటిమెంట్స్ కూడా ఎక్కువ నమ్ముతుందట.ఏదైనా సినిమా ప్రారంభించే ముందు తప్పకుండా దేవుడి దగ్గరికి వెళ్లి పూజలు చేస్తూ ఉంటుందట కృతి శెట్టి.4.కృతి శెట్టి కి యాక్షన్ సినిమాల్లో నటించాలని ఎక్కువగా ఇష్టమట.బాహుబలిలో అనుష్క లాంటి పాత్ర తన డ్రీమ్ రోల్ అంటుంది కృతి శెట్టి.5.కృతి శెట్టికి శివ కార్తికేయన్ సినిమాలంటే ఎంతో ఇష్టమట.
సమయం దొరికితే ఆ సినిమాల్ని చూస్తూ ఉంటుందట.అంతే కాదు తన మొదటి క్రష్ కూడా శివకార్తికేయన్ అంటోంది ఈ ముద్దుగుమ్మ.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy