కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సూర్య( Surya ) కేవలం తమిళ చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇలా నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన సినిమాలకు తెలుగులో కూడా మంచి ఆదరణ లభిస్తుంది.
ఇకపోతే సూర్య ఇలా ఇండస్ట్రీలో సక్సెస్ కావడం వెనుక ఓ హీరో చేసిన అవమానమే కారణమని తెలుస్తుంది.మరి సూర్య ఇండస్ట్రీలోకి రావడానికి కారణమైనటువంటి ఆ హీరో ఎవరు? ఆయనకు జరిగిన అవమానం ఏంటి అనే విషయానికి వస్తే.
సూర్య తండ్రి శివకుమార్( Shiva Kumar ) హీరో ఈయన తండ్రి హీరో అయినప్పటికీ ఎప్పుడూ కూడా సూర్య ఇండస్ట్రీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు.తనకు సినిమాలంటే అసలు ఇష్టం లేదు కానీ ఈయన ఇండస్ట్రీ వైపు రావడానికి కారణం ఆయన కుటుంబ ఆర్థిక పరిస్థితులేనని చెప్పాలి హీరోగా కొనసాగుతున్న సూర్య తండ్రి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు చివరికి అవకాశాలు లేకపోవడంతో సూర్య ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారని తెలుస్తోంది.తన తండ్రి క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడిన ఈయన ఓ బట్టల దుకాణంలో పని చేస్తూ అలాగే ఒక దుకాణం ప్రారంభించారు.
అయినప్పటికీ పెద్దగా లాభాలు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి.
ఒకరోజు నటుడు రఘవరన్ ( Raghuvarun ) సూర్య కలిసి రైలులో ప్రయాణం చేస్తున్నారు.సూర్య గాఢ నిద్రలో ఉండగా నటుడు రఘువరన్ సూర్యను నిద్రలేపి జీవితంలో ఏం సాధించావని ఇలా నిద్రపోతున్నావు ఇంకా ఎన్ని రోజులని మీ తండ్రి పేరు చెప్పుకొని బ్రతుకుతావు అంటూ తనని అవమానపరిచారట.ఇలా రఘువరన్ అనడంతో ఎంతో బాధపడిన సూర్య ఇండస్ట్రీలోకి రావాలని నిశ్చయించుకున్నారట.
అదే సమయంలోనే ఈయన వివిధ భాష సినిమాలను చూసి వారు ఎలాంటి సన్నివేశంలో ఎలాంటి హావ భావాలను పలికిస్తున్నారన్నదానిపై శిక్షణ తీసుకొని ఈయన కూడా ఇండస్ట్రీలోకి వచ్చి నేడు స్టార్ హీరోగా ఎంతోమంది ప్రేక్షక అభిమానులను సంపాదించుకున్నారని చెప్పాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy