భారతీయుడు సినిమాను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్స్ ఎవరో తెలుసా.. లక్ లేదంటూ?

తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన సినిమా భారతీయుడు 2.ఈ సినిమా జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

విడుదల తేదీకి మరికొద్ది రోజులే సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ నీ వేగవంతం చేసింది.ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

ఇకపోతే భారతీయుడు సినిమాను కొందరు టాలీవుడ్స్టార్స్ మిస్ చేసుకున్నారట.ఇంతకీ ఆ హీరోస్ ఎవరు ఎందుకు మిస్ చేసుకున్నారు అన్న వివరాల్లోకి వెళితే.

అయితే ఈ సినిమాలో సేనాపతిగా రాజశేఖర్‌, ఆయన కుమారుడి పాత్రలో వెంకటేశ్‌ లేదా నాగార్జునను తీసుకోవాలనుకున్నారట.కానీ ఆ కాంబో వర్కౌట్‌ కాలేదు.తర్వాత తమిళ నటులు కార్తిక్‌, సత్యరాజ్‌ లను ఎంపిక చేద్దామనుకున్నా అదీ సాధ్యపడలేదట.

Advertisement

ఇక చివరకు కమల్‌ హాసన్‌ ను సంప్రదించగా స్క్రిప్టు బాగా నచ్చడంతో ఆయనే డ్యూయెల్ రోల్ చేసేందుకు ఆసక్తి చూపారట.ముందుగా ఒక హీరోయిన్‌ గా ఐశ్వర్య రాయ్‌ను ఎంపిక చేయాలని భావించినా యాడ్‌ ఏజెన్సీ కాంట్రాక్ట్‌ అప్పటికి పూర్తి కాకపోవడంతో ఆమె నటించలేకపోయారు.

దాంతో మనీషా కొయిరాల నటనను మెచ్చిన శంకర్‌ ఆమెను తన సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారట.రెండవ హీరోయిన్గా ఊర్మిళను ఎంపిక చేసుకున్నారట నిర్మాత ఏఎం రత్నం.సేనాపతి భార్య పాత్ర కోసం ముందుగా రాధికను అనుకోగా చివరకు సుకన్య నటించారు.

సేనాపతి హావభావాలు ప్రేక్షకుల హృదయాల్లో ఎలా నిలిచిపోయాయో ఆ పాత్ర ఆహార్యం అలానే నిలిచిపోయింది.ఇకపోతే భారతీయుడు సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్లు పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేసాయి.

చాలా ఏళ్ళ గ్యాప్ తీసుకొని రిపీట్ అయిన హీరో-హీరోయిన్ల కాంబినేషన్లు ఏంటో తెలుసా ?
Advertisement

తాజా వార్తలు