కడుపు ఉబ్బరం వెనుక ఊహించని కారణాలు

జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన అనేక రకాల సమస్యల్లో కడుపు ఉబ్బరం చాలా ఇబ్బందికరమైనది.

ఈ కడుపు ఉబ్బరం అనేది కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం వలన కలిగే వ్యాధి.

దీనికి ప్రధాన కారణం సమయానికి ఆహారం తీసుకోకపోవడం.ఆధునిక జీవనశైలి, పనుల ఒత్తిడి వలన ఓ పూట తినడం, మరో పూట తినకపోవడంతో వలన కడుపులో ఈ ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి.

Unexpected Reasons For Stomach Bloating-Unexpected Reasons For Stomach Bloating-

దీని వలన కడుపులో మంట, కడుపు ఉబ్బిన భావన, ఆకలి సరిగా వేయకపోవటం వంటి సమస్యలు వస్తాయి.ఈ కడుపు ఉబ్బరం వెనుక మనకు తెలియని కారణాలు కూడా ఉన్నాయి.

* డిప్రేషన్ కూడా కడుపు ఉబ్బరానికి కారణమవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.డిప్రేషన్ వలన హార్మోన్ల విడుదలలో జరిగే అవకతవకల వలన ఇలా జరుగుతుంది.

Advertisement

* యాంటిబయాటిక్స్ మెడిసిన్స్ ఎక్కువగా వాడినా శరీరానికి ప్రమాదమే.మరీ ముఖ్యంగా స్ట్రాంగ్ యాంటిబయాటిక్స్ అతిగా వాడితే కడుపు ఉబ్బరం మొదలవుతుంది.

* ఒకేచోట కూర్చోని పనిచేసేవారికి కూడా కడుపు ఉబ్బరం వస్తుంది.కంప్యూటర్ మీద గంటలకొద్దీ కూర్చోనే వారికే కడుపులో సమస్యలు ఇందుకే వస్తాయి.

దీనికీ కారణం రక్తప్రసరణ తగ్గడం.* పీసిఓడి , థైరాడ్ సమస్యలతో బాధపడేవారికి కూడా కడులు ఉబ్బరం వస్తుంది.

ఈ డిజార్డర్ సమస్యలతో బాధపడేవారికి కడుపు ఉబ్బరం అదనం అన్నమాట.* పొద్దున్న తిన్నామంటే మళ్ళీ సాయంత్రం తినడం, రాత్రి తిన్నామంటే తరువాతి రోజు మధ్యహ్నం తినడం లాంటి చేష్టల వలన కడపు ఉబ్బరం వస్తుంది.

ఇడ్లీ ,అట్టు రోజూ తింటున్నారా .. ఆరోగ్యానికి మంచిదేనా ... ! ఏ టిఫిన్స్ తింటే మంచిది తెలుసుకోండి
Advertisement

తాజా వార్తలు