పెళ్లిలో ఊహించని ఘటన.. అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంతో బెంబేలెత్తిన అతిథులు

పెళ్లి అంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది.వధూవరుల తరుపు బంధువులు, సన్నిహితులతో పెళ్లి మండపం కోలాహలంగా దర్శనమిస్తుంటుంది.

బంధువులంతా ఒకరినొకరు పలకరించుకుంటూ, ఉత్సాహంగా పెళ్లి వేడుకలో పాల్గొంటుంటారు.అయితే పెళ్లి అన్నాక చాలా అవాంతరాలు ఎదురవుతాయి.

అయితే తాజాగా విశాఖలో జరిగిన ఓ ఘటన పెళ్లికి వచ్చిన అతిథులను కంగారు పెట్టించింది.పెళ్లి మండపం లో నుంచి ఒక్కొక్కరుగా అతిథులు అంతా బయటకు పరుగులు తీశారు.

అసలు ఏం జరిగిందో తెలియక పెళ్లింటి వారు కంగారు పడ్డారు.తీరా అసలు కారణం తెలుసుకుని అంతా అవాక్కయ్యారు.

Advertisement

తమకు ఎదురైన సమస్యను తెలుసుకుని ఖంగుతిన్నారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

విశాఖలోని చినముషిడివాడ ప్రాంతం అది.శుక్రవారం ఓ పెళ్లి మండపంలో వివాహ వేడుక కోసం భారీగా అతిథులు తరలి వచ్చారు.తర్వాతి రోజు పెళ్లి తంతు జరగనుంది.

ఇంతలో ముందు రోజు రాత్రి వివాహ వేడుక కోసం వచ్చిన అతిథులు, బంధువుల కోసం విందు భోజనం ఏర్పాటు చేశారు.చాలా మంది భోజనానికి కూర్చున్నారు.ఇంతలో వారి కాళ్ల క్రింద ఉన్న భూమి ఏదో అవుతుందని అందరికీ అనిపించింది.

కిందకు చూడగానే అంతా షాక్ అయ్యారు.ఫ్లోర్ పై అమర్చిన టైల్స్ ఒక్కొక్కటిగా పగిలిపోయాయి.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
సినిమా ట్రైలర్స్ వ్యూస్ వెనుకున్న అసలు మోసం ఏంటో తెలుసా?

అతిథులు భోజనం చేస్తున్న ప్రాంతం బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది.దీంతో అతిథుల్లో కలవరం మొదలైంది.ఒక్కొక్కరుగా భయంతో కిందికి పరుగులు తీశారు.

Advertisement

పెళ్లింటి వారు కూడా ఏమైందోనని వెళ్లి చూశారు.దీంతో వారికి సమస్య అర్ధం అయింది.

విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి విచారణ చేపట్టారు.సమస్య తెలుసుకుని విచారించారు.

పెళ్లికి ఇబ్బంది కలగకుండా వివాహ వేదికను సమీపంలోని మరో పెళ్లి మండపానికి మార్చారు.సమస్య ఎందుకు తలెత్తిందో అధికారులు ఆరా తీస్తున్నారు.