వంగలపూడి అనిత ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష లు చేస్తున్న తెదేపా శ్రేణులు...

ఎస్.

రాయవరం మండలం లో గురజాడ విగ్రహం వద్ద తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష లు చేస్తున్న తెదేపా శ్రేణులు.

ఎన్.టి.ఆర్ వైద్య విశ్వ విద్యాలయం పేరు మార్చాలని అప్పట్లో రాజశేఖర్ రెడ్డి కూడా అనుకోలేదు ప్రస్తుత ముఖ్యమంత్రి తుగ్లక్ పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మాత్రం ముందుకు వచ్చారన్నారు.వైద్య విశ్వ విద్యాలయం కు పెట్టిన వై.ఎస్.ఆర్ పేరు తొలగించి ఎన్.టి.ఆర్ పేరు పునరుద్ధరణ చేసే వరకూ ఈ రిలే నిరాహారదీక్ష లు కొనసాగుతాయన్నారు.జబర్దస్త్ మంత్రి రోజా కోసి కారం పెడతామని చెప్పడం పద్ధతేనా అని మండిపడ్డారు.

సీమలో పుట్టిన వారు చిన్న పిల్లలు ,ఆడవాళ్ళ జోలికి రారని పూర్వం నుండి ఒక నానుడి ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా చిన్న పిల్లల జిలికి రావడం జరిగిందన్నారు.మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి కి వాళ్ళ నాన్న పేరు పెట్టుకోవాలని అనిపిస్తే కొత్త యూనివర్సిటీ ఏర్పాటు చేసి అప్పుడు వై.ఎస్.ఆర్ అని పెట్టు కోవాలన్నారు.ఈ మూడున్నర ఏళ్ళ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక అభివృద్ది కార్యక్రమం అయినా ఉందా అంటూ అనిత ఫైర్.

అధికారం వచ్చినప్పటి నుండి ప్రజావేదిక కూల్చడం నుండి ఇప్పటివరకు కూల్చివేత లు తప్ప కట్టడాలు ఏమైనా చేశారా అంటూ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బుద్దా నాగ జగదీష్ అన్నారు.ఎన్.టి ఆర్ పేరు కే మచ్చ తెచ్చే విధంగా ,ఆయన ప్రతిష్ట కు భంగం కలిగేలా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు.తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు పేరుతో ఉన్న ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును వైయస్సార్ ప్రభుత్వం కుట్రపూరిత నిర్ణయం అన్నారు.

Advertisement

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కింజరపు అచ్చయ్య నాయుడు పిలుపుమేరకు ఈ రిలే నిరాహారదీక్షలు చేపట్టడం జరిగిందన్నారు.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!
Advertisement

తాజా వార్తలు