ట్యాలెంట్ ఎవరి సొంతం కాదు... నవీన్ పోలిశెట్టి కి అందరు ఫిదా అవ్వాల్సిందే !

జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి( Naveen Polishetty ) చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్ అని చెప్పుకోవచ్చు.

ఈ హీరో కామెడీ టైమింగ్, డైలాగ్ డిక్షన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది.

జబర్దస్త్ టైపు అశ్లీల కామెడీతో అటు టీవీ షోలు, ఇటు సినిమాలు భ్రష్టు పట్టుకుపోయాయి.ఇలాంటి సమయంలో హెల్తీ కామెడీ చేస్తూ నవీన్ పోలిశెట్టి ప్రత్యేకంగా నిలుస్తున్నాడు.

ఒక్క డబుల్ మీనింగ్ లేదా బూతు మాట లేకుండా పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తూ తన రియల్ టాలెంట్ ని బయటపెడుతున్నాడు.మకిలి పట్టిన తెలుగు కామెడీ దుమ్ము దులిపేస్తున్నాడు.

ప్రస్తుత కమెడియన్లు ఇతన్ని చూసి చాలా నేర్చుకోవాలి.జాతిరత్నాలు,( Jathi Ratnalu ) ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, చిచోరా, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాల్లో నవీన్ పండించిన కామెడీ చూస్తే అంత డీసెంట్‌గా కూడా కామెడీ పండించగలరా అని ఆశ్చర్యపోకు తప్పదు.

Advertisement

సినిమాల్లోకి రాకముందు స్టాండప్ కమెడియన్‌గా కొన్ని అడల్ట్ జోకులు చేసాడేమో కానీ సినిమాల్లోకి వచ్చాక వాటి జోలికి వెళ్లడం లేదు.యూట్యూబర్, టీవీ షోల్లో కూడా చాలా హెల్తీ కామెడీ చేసి ప్రేక్షకులకు ఎంతగానో దగ్గర అయ్యాడు.

మంచి యాక్టర్ కావాలనే కలిసి చివరకు పార్ట్ టైం జాబులు చేశాడు.సివిల్ ఇంజనీర్ పేరిట లండన్ వెళ్లి అక్కడ కూడా యాక్టింగ్‌పై దృష్టి సారించాడు.

అయితే అనుష్కతో సినిమా చేశాక ఇప్పటిదాకా ఎలాంటి మూవీ ప్రకటించలేదు.దాంతో చాలా రూమర్స్ వచ్చాయి.

ఈ నేపథ్యంలో తనకి ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యిందని, అంతకుమించి ఇంకేమీ కాలేదని వివరణ ఇచ్చాడు.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

ఒక వీడియో షేర్ చేసి తన చెయ్యి ఫ్రాక్చర్ అయిందని చెప్పాడు ఆ విషయాన్ని కూడా చాలా హిలేరియాస్‌గా చెప్పి నవ్వించాడు.ఇప్పుడు హఠాత్తుగా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షోకు( Telugu Indian Idol ) అతిథిగా వచ్చి సర్‌ప్రైజ్‌ చేశాడు.చెయ్యి ఫ్రాక్చర్ అయినా సరే అతనిలో ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు.

Advertisement

పంచులూ ఎప్పటిలాగానే వేసి తెగ నవ్వించేసాడు.యాక్సిడెంట్ గురించి కూడా మాట్లాడాడు.

చేయి పని చేయకుండా పోతుందేమో అని భయపడ్డాను అని, అలాంటి కష్టంలో నాకు మ్యూజిక్ అండగా నిలిచింది అంటూ ఎమోషనల్ అయ్యాడు.చేతికి బ్యాండ్లు ఇంకా రిమూవ్ చేయకపోయినా అతను ఈ షోలో పాల్గొని ఆశ్చర్యపరిచాడు.

ఈ షోకి సంబంధించి తాజాగా ఒక ప్రోమోలో రిలీజ్ అయింది.అందులో నవీన్ పోలిశెట్టి ఓ హిందీ పాట చక్కగా పాడి వావ్ అనిపించాడు.నవీన్‌లో ఈ కొత్త టాలెంట్ కూడా ఉందా అని చాలామంది నోరెళ్లబెడుతున్నారు.

ఈ పాట ఏదో సరదాగా పాడలేదు.ఒక ప్రొఫెషనల్ సింగర్ లాగానే పాడారు.

దీన్ని బట్టి ఆయన సంగీతంపై కొంచెం పట్టు సాధించి పాటలు పాడటం కూడా నేర్చుకున్నాడని తెలుస్తోంది."అనగనగా ఒక రాజు"( Anaganaga Oka Raju ) సినిమాకి నవీన్ సంతకం చేసినట్లు సమాచారం.

అందులో ఓ పాట నవీన్‌తో పాడిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.థమన్ నవీన్‌లోని ఈ టాలెంట్‌ను చూశాడు కాబట్టి అతనికి భవిష్యత్తులో ఒక పాట పాడే ఛాన్స్ ఇవ్వచ్చు.

ఇకపోతే నవీన్ కోసమైనా ఆహా ఇండియన్ ఐడల్ తెలుగు షో చూడొచ్చు.

తాజా వార్తలు