వలసలకు చెక్ .. యూకే కఠిన చర్యలు , అందుబాటులోకి పటిష్ట యంత్రాంగం

దేశంలో నానాటికీ పెరుగుతున్న వలసలను( Migrations ) అరికట్టడానికి బ్రిటన్ ప్రభుత్వం( Britain Government ) కఠిన చర్యలు తీసుకుంటుండగా.

ఈ వారం మరింత దూకుడు పెంచింది.

దీనిలో భాగంగా విదేశీ కార్మికులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి చర్యలు చేపట్టింది.దేశంలో ఇమ్మిగ్రేషన్ వ్యవస్ధలోని లోపాలను పరిష్కరించడానికి మైగ్రేషన్ అడ్వైజరీ కమిటీ (ఎంఏసీ)( Migration Advisory Committee ) ప్రధాన పాత్ర పోషిస్తుందని భారత సంతతికి చెందిన యూకే వలసలు, పౌరసత్వ శాఖ మంత్రి సీమా మల్హోత్రా( Minister Seema Malhotra ) వ్యాఖ్యానించారు.

చట్టపరమైన వలసలను తగ్గించడానికి , మరిన్ని కొత్త అంశాలను చేర్చడానికి హోమ్ ఆఫీస్ వచ్చే ఏడాది ఇమ్మిగ్రేషన్ విషయంలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టనుందని ఆమె తెలిపారు.గడిచిన ఐదేళ్లలో నికర వలసలు నాలుగు రెట్లు పెరిగాయని సీమా మల్హోత్రా చెప్పారు.

మా ప్రణాళికలో భాగంగా వలసలను తగ్గించి , విచ్ఛిన్నమైన ఇమ్మిగ్రేషన్ వ్యవస్ధను( Immigration System ) పునరుద్ధరిస్తామని మంత్రి స్పష్టం చేశారు.స్వతంత్ర మైగ్రేషన్ అడ్వైజరీ కమిటీ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

నైపుణ్యం, లేబర్ మార్కెట్, వలసలను అనుసంధానించడానికి నిష్పాక్షికమైన విశ్లేషణ అవసరమని సీమా అభిప్రాయపడ్డారు.స్వదేశీ ప్రతిభకు ప్రత్యామ్నాయంగా వలసను ఉపయోగించకుండా చూడాలని ఆమె కోరారు.

కాగా.ప్రొఫెసర్ బ్రియాన్ బెల్‌ను మైగ్రేషన్ అడ్వైజరీ కమిటీకి చైర్‌గా పూర్తి కాలం వ్యవహరిస్తారని సీమా మల్హోత్రా స్పష్టం చేశారు.డిప్యూటీ చైర్‌గా మడేలిన్ సంప్షన్ ఉంటారని ఆమె మంగళవారం తెలియజేశారు.

యూకే దేశీయ శ్రామిక శక్తికి మద్ధతు ఇవ్వడం, విదేశీ కార్మికులపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఆర్ధిక వృద్ధిని పెంచడంపై దృష్టి సారించాలని సీమా పేర్కొన్నారు.

కొత్త క్వాడ్ వ్యవస్ధలో భాగంగా స్కిల్స్ ఇంగ్లాండ్, డిపార్ట్‌మెంట్ ఫర్ వర్క్ అండ్ పెన్షన్స్ అండ్ ఇండస్ట్రియల్ స్ట్రాటజీ కౌన్సిల్‌తో అంతర్జాతీయ రిక్రూట్‌మెంట్‌ను తగ్గించడంలో సేవలందిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.ఐటీ, ఇంజనీరింగ్ వంటి కీలక రంగాలలో స్వదేశీ కార్మికుల కొరతపై యూకే హోమ్ సెక్రటరీ వైవెట్ కూపర్ సమీక్ష చేసిన తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.

ఇంజనీరింగ్ చదవాలనుకునే విద్యార్థులకు శుభవార్త.. UK యూనివర్సిటీ నుంచి భారీ స్కాలర్‌షిప్‌లు!
Advertisement

తాజా వార్తలు