దేవుడా.. మహిళలు ఎంతకు తెగించారు.. వ్యక్తిని ఏకంగా..?

ప్రస్తుత రోజులలో దేశం ఏదైనా సరే.ఆడవారికి మాత్రమే కాదు.

మగవారికి కూడా రక్షణ లేకుండా పోతుంది.

లింగ బేధం అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ దాడులు, దౌర్జన్యాలు జరుగుతూ ఉండడం మనం నిత్యం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం.

అలాంటి దారుణమైన సంఘటనలలో ఏదైనా సహాయం చేయడానికి అని వెళ్తే.వారికి కూడా చివరికి అన్యాయమే మిగులుతుంది.

ఏదో పక్క వారు ఇబ్బందుల్లో ఉన్నారని వెళ్లి సహాయం చేయడానికి పోయి చివరికి అతడే చిక్కుల్లో పడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక వ్యక్తిని ఇద్దరు మహిళలు( Two Women ) దారుణంగా దోపిడీకి పాల్పడ్డారు.

Advertisement

ఈ సంఘటన మాత్రం భారత దేశంలో కాకుండా విదేశాలలో జరిగినట్లు వీడియో చూస్తే తెలుస్తోంది.వీడియో ఆధారంగా రాత్రి సమయంలో ఇద్దరు మహిళలు మద్యం తాగినట్లు( Drunk ) నటిస్తూ రోడ్డుకు అటు ఇటు నడవడం మనం వీడియోలో చూడవచ్చు.అలాగే వారికి ఎదురుగా ఒక వ్యక్తి ఈ క్రమంలో ఆ ఇద్దరి మహిళల్లో ఒక మహిళ గుండె నొప్పి( Heart Attack ) వచ్చినట్లు నటించగా.

సదరు వ్యక్తి ఆ మహిళను సహాయం చేసేందుకు వెళ్ళాడు.

ఈ తరుణంలో మరో మహిళ ఆ వ్యక్తి వెనుక వైపుకు వెళ్లి తనతో తెచ్చుకున్న ఒక సిరంజిని తీసి అతనికి ఇంజక్షన్( Injection ) చేసేసింది.దీంతో వెంటనే ఆ వ్యక్తి నొప్పితో ఇబ్బంది పడుతూ అక్కడే కింద పడిపోయాడు.ఒకవైపు ఆ వ్యక్తి నొప్పితో ఇబ్బంది పడుతుంటే.

ఆ ఇద్దరు మహిళలు మాత్రం అతని వద్ద ఉన్న డబ్బులు దోచుకొని అక్కడి నుంచి పారిపోవడం మనం గమనించవచ్చు.ఇక ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు అయితే ఈ ఆధునిక కాలంలో మగవారికి కూడా రక్షణ లేకుండా పోయింది అంటూ కామెంట్ చేస్తున్నారు.

How Modern Technology Shapes The IGaming Experience
How Modern Technology Shapes The IGaming Experience

మరికొందరేమో కేవలం ఆడోళ్లకే కాదు మగాళ్లకు కూడా రక్షణ కలిగించాలని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు