రెండు స్క్రీన్ల నోకియా ఫ్లిప్ ఫోన్ లాంచ్: ధర, ఫీచర్స్ ఇవే..!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల కంపెనీ నోకియా బేసిక్ కీబోర్డ్ మోడల్( Nokia Basic Keyboard Model ) లోనే పాతకాలపు ఫ్లిప్ ఫోన్లను తాజాగా లాంచ్ చేసింది.4G కనెక్టివిటీతో వస్తున్న ఈ ఫోన్లు మధ్యతరగతి కొనుగోలుదారులకు అందుబాటు ధరలోనే విడుదల అయినందు వల్ల అమ్మకాలు పెరుగుతాయని కంపెనీ విశ్వసిస్తుంది.

నోకియా 2660 పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్ పాప్ పిక్, లష్ గ్రీన్ కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

ఈ ఫోన్ కు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

Two-screen Nokia Flip Phone Launch: Price, Features Are The Same , Nokia Basic K

నోకియా 2660 ఫ్లిప్ ఫోన్ క్లామ్ షెల్ డిజైన్( Nokia 2660 flip phone clam shell design ) తో వస్తుంది.ఇది 2.8 అంగుళాల డిస్ ప్లే తో వస్తోంది.1450 mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది.ఈ ఫోన్ క్లియర్ కాల్ క్లారిటీ ఇస్తుంది.

ఇందులో వాల్యూమ్ సెట్టింగ్స్ ను అడ్జస్ట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.ఇందులో హియరింగ్ అండ్ కంపాటబుల్ ఫీచర్ ఉంటుంది.ఈ ఫీచర్ తో ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా కాల్స్ మాట్లాడవచ్చు.1జీ హెర్జ్ వరకు యూనీ సొక్ టీ107 సింగిల్- కోర్ ప్రాసెసర్ ఉంటుంది.

Two-screen Nokia Flip Phone Launch: Price, Features Are The Same , Nokia Basic K
Advertisement
Two-screen Nokia Flip Phone Launch: Price, Features Are The Same , Nokia Basic K

ఈ ఫోన్ లో 48 MB RAM, 128 MB ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రో ఎస్డి కార్డుతో 32 GB వరకు మెమరీను విస్తరించుకోవచ్చు.డ్యూయల్ సిమ్ స్లాట్స్ ఉంటాయి.ఎస్ 30 ప్లస్ ఓఎస్ పై ఆధారపడి పనిచేస్తుంది.3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, వైర్లెస్ FM రేడియో, ఎంపీ 3 ప్లేయర్ వస్తాయి.4G వోల్ట్ కనెక్టివిటీ, బ్లూ టూత్ 4.2, మైక్రో యూఎస్బి 2.0 ఉంటాయి.ఈ ఫోన్ రెండు కలర్ల వేరియంట్లలో లభిస్తుంది.ఈ ఫోన్ ధర రూ.4699 గా ఉంది.నోకియా అధికారిక వెబ్సైట్ లో ఆగస్టు 24వ కొనుగోలు చేయవచ్చు.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!
Advertisement

తాజా వార్తలు