నల్గొండ జిల్లాలో రెండు రోడ్డుప్రమాదాలు.. ఆరుగురు మృతి

నల్గొండ జిల్లాలో విషాదం నెలకొంది.రెండు వేర్వేరు స్థలాల్లో జరిగిన రోడ్డుప్రమాదాల్లో మొత్తం ఆరుగురు మృత్యువాతపడ్డారు.

దీంతో పండుగ పూట బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంది.

రోడ్డు పక్కన వెళ్తున్న పాదచారిని బైకు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు.బైకిస్ట్ మరణవార్త విన్న కుటుంబ సభ్యులు ఆటోలో ఘటనా స్థలానికి వెళ్తుండగా మరో ప్రమాదం చోటు చేసుకుంది.

నిడమానూరు మండలం వెంపాడ్ స్టేజీ దగ్గర బంధువులతో వెళ్తున్న ఆటోను ట్యాంకర్ ఢీకొట్టడంతో నలుగురు మృత్యువాత పడ్డారు.అలాగే మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.వెంటనే గమనించిన స్థానికులు బాధితులను సమీప ఆస్పత్రికి తరలించారు.

Advertisement

అనంతరం రెండు ప్రమాదాలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021
Advertisement

తాజా వార్తలు