వైరల్ వీడియో: గాల్లో రెండు విమానాలకు తప్పిన పెను ప్రమాదం..

తాజాగా ఆకాశంలో తృటిలో ఓ ఘోర ప్రమాదం తప్పిందని చెప్పాలి.

రెండు విమానాలు( Two Planes ) గాలిలో ఒక్కసారిగా ఢీ కొట్టబోయే లాగా కనపడడంతో ఒక్కసారిగా అందరికీ గందరగోళం వాతావరణం ఏర్పడింది.

ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్‌ అవుతున్న ఒక విమానం, టేకాఫ్‌ అవుతున్న మరో విమానం ఢీ కొట్టబోయాయి.ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళితే.

న్యూయార్క్‌ లోని( New York ) సిరక్యూస్ హాన్‌ కాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్ట్‌ లో( Syracuse Hancock International Airport ) రెండు ప్రముఖ విమానాయా సంస్థలకు చెందిన రెండు విమానాలు ఢీ కొట్టుకోబోయాయి.

ఇక ఎయిర్‌ పోర్ట్‌ లో కంట్రోలర్లు ముందుగా అమెరికన్ ఈగిల్ ఫ్లైట్ AA5511, PSA ఎయిర్‌లైన్స్ నిర్వహిస్తున్న బొంబార్డియర్ CRJ 700 ను రన్వే 28 లో ల్యాండ్ చేయడానికి అనుమతి ఇచ్చారు.ఇక కొద్దిసేపటి తర్వాత అధికారులు డెల్టా కనెక్షన్ DL5421, ఎండీవర్ ఎయిర్ నిర్వహిస్తున్న మరో CRJ 700కి అదే రన్వే నుండి బయలుదేరడానికి అనుమతి ఇచ్చారు.ఈ నేపథ్యంలో 2 విమానాలు ఆకాశంలో ఒక సమయంలో చాలా దగ్గరకు వచ్చాయి.2 విమానాలు ఒక్కసారిగా ఢీ కొట్టేంత పని అయిపోయింది.

Advertisement

కానీ., ఫ్లైట్‌ రాడార్‌ 24 వెబ్సైట్ ప్రకారం.విమానాలు ఒకదానికొకటి నిలువుగా ఓ 700 అడుగుల దూరంలో వచ్చినట్లు తెలుస్తుంది.

ఇక వాస్తవానికి ఆ సమయంలో డెల్టా విమానంలో 76 మంది ప్రయాణికుల ప్రయాణిస్తుండగా, అమెరికన్ ఎయిర్లైన్స్( American Airlines ) విమానంలో 75 మంది ప్రయాణిస్తున్నారు.అదృష్టం బాగుండడంతో.

ఎటువంటి ప్రమాదం జరగకుండా ప్రయాణికులందరూ కూడా క్షేమంగా ఉన్నారని విమాన సంస్థ వారు తెలిపారు.ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇండియాలోనే అతిపెద్ద ట్రక్కు.. దీనికి ఎన్ని చక్రాలు ఉన్నాయో తెలిస్తే..
Advertisement

తాజా వార్తలు