బిగ్ అప్డేట్ తో రాబోతున్న ఎన్టీఆర్.. ఫ్యాన్స్ కు పండగే !

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.ఇందులో ఎన్టీఆర్ ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నాడు.

రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించే బోతున్నాడు.

మొన్నటి వరకు కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది.పరిస్థితులు చక్కబడడంతో మళ్ళీ రెండు రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

Advertisement
Two New Updates Ready For Ntr Fans, NTR, RRR, Evaru Meelo Koteeswarudu, Gemini T

ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ తొందరగా పూర్తి చేసి తర్వాత మరొక సినిమా స్టార్ట్ చెయ్యాలని చూస్తున్నాడు.త్వరలోనే ఈ విషయంపై అప్డేట్ రాబోతుందని తెలుస్తుంది.

Two New Updates Ready For Ntr Fans, Ntr, Rrr, Evaru Meelo Koteeswarudu, Gemini T

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే అన్ని బాగుంటే ఈ పాటికే కొరటాల శివతో సినిమా స్టార్ట్ అయ్యేది.కానీ కరోనా కారణంగా సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి.ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి కాగానే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లేందుకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుంది.

Two New Updates Ready For Ntr Fans, Ntr, Rrr, Evaru Meelo Koteeswarudu, Gemini T

ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ఎవరు మీలో కోటీశ్వరులుషో కూడా చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే

ప్రోమోలు

కూడా వదిలారు జెమిని టివి వారు.ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి కాగానే ఈ షో కూడా మొదలు పెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయట.

ఇప్పటికే ఆడిషన్స్ కూడా మళ్ళీ పునః ప్రారంభం చేశారట.ఆగస్టు కల్లా ఈ షో ద్వారా ఎన్టీఆర్ మనల్ని పలకరించడానికి రెడీ అవుతున్నడని తెలుస్తుంది.

మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు దీన్ని తింటే ఏమవుతుందో తెలుసా..?

మరి ఈ రెండు ప్రాజెక్ట్స్ పై త్వరలోనే అప్డేట్ కూడా రాబోతుందని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు