ప్రాణం మీదకు తెచ్చిన పాన్.. కర్రలతో దాడి!

చిన్న చిన్న కారణాలకే కొందరికి విపరీతమైన కోపం వస్తుంది.ఆ కోపంలో వాళ్లు ఏం చేస్తారో వారికే తెలియదు.

తన పట్ల తమకు కంట్రోల్ ఉండదు.ఆవేశంతో ఊగిపోతారు.

అయితే ఇలాంటి అదుపులేని ఆవేశం, కోపం ఏమాత్రం మంచి చేయకపోగా.తీవ్రంగా నష్టాన్ని చేకూరుస్తుంది.

దాని వల్ల తమకు తాము హాని చేయడమో లేదా ఇతరులకు హానీ చేయడమో జరుగుతుంది.అందుకే కోపాన్ని అదుపులో పెట్టుకోవాలని చెబుతుంటారు.

Advertisement

ఆవేశాన్ని అణచుకోవాలని బోధిస్తుంటారు.గుజరాత్ లో జరిగిన ఓ ఘటన.కోపం ఎంత దారుణానికైనా ఒడిగడుతుంది అనే దానికి ఉదాహరణ నిలుస్తోంది.చిన్న కారణానికే ఓ వ్యక్తిని ఇద్దరు కలిసి కొట్టారు.

దెబ్బలు తిన్న వ్యక్తి ఇప్పుడు మృత్యువుతో పోరాడుతున్నాడు.అసలేం జరిగిందంటే.

అది గుజరాత్ సూరత్ లోని సర్దార్ నగర్.షకీల్ అనే యువకుడు పాన్ మసాలా తినేందుకు పాన్ దుకాణానికి వచ్చాడు.

అంతలోనే సమీర్, సోహైల్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా అక్కడికి వచ్చారు.తమ ఇద్దరికి గుట్కా, పాన్ ఇప్పించాలని షకీల్ ను బెదిరించారు.

కఠినమైన చర్మాన్ని సూపర్ స్మూత్ గా మార్చే సింపుల్ టిప్ మీకోసం!

వారిద్దరికీ తన డబ్బులతో గుట్కా, పాన్ ఇప్పించేందుకు షకీల్ ఒప్పుకోలేదు.తన వద్ద డబ్బులు లేవని, అయినా తానెందుకు పాన్ ఇప్పించాలని ప్రశ్నించాడు.

Advertisement

దీంతో సమీర్, సోహైల్ షకీల్ ను ఇష్టారీతిగా తిట్టడం మొదలు పెట్టారు.అసభ్య పదజాలం వాడుతూ కర్రలతో షకీల్ పై దాడికి దిగారు.

విచక్షణారహితంగా కోట్టారు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి.

షకీల్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.

తాజా వార్తలు