యూకేలో విషాదం.. సరస్సులో మునిగి ఇద్దరు భారత సంతతి బాలురు మృతి

యూకేలో విషాదం చోటు చేసుకుంది.సరస్సులో మునిగి ఇద్దరు భారత సంతతి బాలురు మరణించారు.

వీరిద్దరిని కేరళకు చెందిన 16 ఏళ్ల రూవెన్ సైమన్, జోసెఫ్ సెబాస్టియన్‌గా గుర్తించారు.వీరు తమ మిత్రులతో కలిసి సోమవారం సాయంత్రం సరదాగా ఈత కొట్టేందుకు సైక్లింగ్ చేసుకుంటూ ఎనాగ్ లాఫ్‌కి వచ్చినట్లు ఐర్లాండ్ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టర్ ఆర్‌టీఈ నివేదించింది.

నార్తర్న్ ఐర్లాండ్ పోలీస్ సర్వీస్ ప్రకటన ప్రకారం.స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 6.30 గంటలకు అలారం వినిపించిందని, ఆ వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలిపారు.నార్తర్న్ ఐర్లాండ్ అంబులెన్స్ సర్వీస్ (ఎన్ఐఏఎస్) కూడా హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుంది.

పారామెడిక్స్, ఐదుగురు అత్యవసర సిబ్బంది, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లు సైతం రంగంలోకి దిగాయి.ఈ క్రమంలో నీళ్లలో నుంచి ఒక బాలుడిని రక్షించి ఆసుపత్రికి తీసుకెళ్లారు.

Advertisement

అక్కడ చికిత్స పొందుతూ అతను ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.ఫోయిల్ సెర్చ్, డైవర్ల గాలింపు చర్యల తర్వాత రెండవ బాలుడిని కూడా రక్షించారు.

అయితే అతను సంఘటనా స్థలంలోనే మరణించినట్లు మీడియా పేర్కొంది.అనంతరం మరో బాలుడిని రక్షించగా అతనికి ప్రాణాపాయం తప్పింది, అలాగే మరో ముగ్గురు కూడా క్షేమంగా వున్నారని నార్త్ ఐర్లాండ్ పోలీస్ సర్వీస్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ఘటన విషయం తెలుసుకున్న ఐర్లాండ్ ప్రధాన మంత్రి మైఖేల్ మార్టిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.ఈ బాలురు స్థానిక ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్నారని.గతవారం జీసీఎస్‌ఈ ఫలితాలలో మంచి ప్రతిభ కనబరిచారని అధికారులు తెలిపారు.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!
Advertisement

తాజా వార్తలు