jeevitha : హీరోయిన్ గా ఆఫర్ కావాలంటే రూమ్ కి రావాల్సిందే అన్నారు.. నటి వైరల్ కామెంట్స్!

సినిమా ఇండస్ట్రీలో ఎదగాలి అన్న రాణించాలి అన్న చాలా కష్టపడాలి.అంతేకాకుండా ఎన్నో అవమానాలను కష్టాలను సక్సెస్ ని ఫెయిల్యూర్ లను కొన్ని ధైర్యంగా నిలబడాలి.

అలాగే అవకాశాల కోసం ఎదురు చూడాలి.అలా సినిమా ఇండస్ట్రీ అంటేనే సవాళ్లతో కూడుకున్నది అని చెప్పవచ్చు.

ఇక కెరియర్ ఆరంభంలో అయితే ఎన్నో విధాలుగా మనకు ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి.మరి ముఖ్యంగా హీరోయిన్ లు నటీమణులు ఎక్కువగా వేధింపులకు గురవుతూ ఉంటారు.

ప్రస్తుతం హీరోయిన్లుగా అలాగే ఆర్టిస్ట్ గా నటిస్తున్న ఎంతోమంది నటీమణులు ఒకానొక సమయంలో కాస్టింగ్ కౌచ్ అనుభవాలను ఎదుర్కొన్నారు అన్న సంగతి మనందరికి తెలిసిందే.ఇలా ఉంటే తాజాగా ఈ జాబితాలో మరో బుల్లితెర నటి కూడా చేరింది.ఆమె మరెవరో కాదు.

Advertisement

కడైకుట్టి సింగం ( Kadaikutty Singham )తమిళ సీరియల్ ఫేమ్ జీవిత ( jeevitha )తన కెరీర్ లో ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించింది.ఈ నేపథ్యంలోనే కెరియర్ మొదట్లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఆమెకు ఎదురైన చేదు సంఘటన గురించి చెప్పుకొచ్చింది.

ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా జీవిత మాట్లాడుతూ.

ఒక దర్శకుడు తనకు సినిమాలు హీరోయిన్గా పాత్రను ఆఫర్ చేశాడని, అధిక రెమ్యూనరేషన్ అలాగే మరిన్ని సినిమా అవకాశాలు ఇస్తాను అని ఆశచూపించాడని, కానీ అందుకోసం సర్దుకుపోవాలి అని ఆమెను కోరాడట.అయితే ఆ సమయంలో ఆమెకు సినిమా ఇండస్ట్రీ కొత్త అందులోనూ కెమెరామెన్ నిర్మాత మేనేజర్ తో సర్దుకుపోవాలని ఆమెతో అన్నారట.అంతేకాకుండా ఎప్పుడు పిలిస్తే అప్పుడు గదికి రావాలి అన్నారట.

దాంతో దర్శకుడు మాటలకు షాక్ అయిన ఆమెకు సమయంలో ఏడుపు వచ్చేసిందట.దర్శకుడు మాటలను అవమానంగా ఫీల్ అయిందట.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

అప్పుడు ఆదర్శకుడి మాటలు విన్న ఆమె అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా వచ్చేసిందట.ఇదే విషయాన్ని చెబుతూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement

అంతే కాకుండా ఆ సంఘటన తర్వాత తనకు జీవితం పై విరక్తి కలిగిందని ఆమె తెలిపింది.

తాజా వార్తలు