తిరుమలకు వెళ్లాల్సిన భక్తులు కచ్చితంగా ఇవి తెలుసుకోవాలి..

తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం సూచనలని తెలుసుకోవాలని అధికారులు చెబుతున్నారు.వైకుంఠ ద్వార దర్శనం ద్వారా వీలైనంత ఎక్కువ మంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు.

2020లో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా పది రోజుల్లో సుమారు 8 లక్షల మందికి దర్శనం కనిపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.సర్వదర్శనానికి వచ్చే భక్తులు టైమ్ స్లాట్ బుక్ చేసుకోవడం ద్వారా ఎక్కువ సమయం  క్యూ లైన్ లో వేచి చూడకుండా సరైన సమయానికి స్వామివారి దర్శనం చేసుకోవచ్చని తెలిపారు.

సర్వదర్శనానికి వచ్చే భక్తులు ముందు తిరుపతిలో జారీ చేసే టైమ్ స్లాట్ టోకెన్లు తీసుకున్న తర్వాతే తిరుమల కొండపైకి రావాలని వెల్లడించారు.తిరుపతిలో సర్వదర్శనం టికెట్లను తీసుకున్న తర్వాత సరైన సమయానికి కొండపైకి చేరడం వల్ల రద్దీని కంట్రోల్ చేయడానికి దేవస్థానం అధికారులకు భక్తులు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.ఇంకా చెప్పాలంటే సర్వదర్శనం టోకెన్లను అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురు గా ఉన్న విష్ణు నివాసం, రైల్వే స్టేషన్ వెనుక ఉన్న రెండు, మూడు సత్రాలు, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్నా శ్రీనివాసం కాంప్లెక్స్, ఇందిరా గ్రౌండ్స్,

జీవకోన జిల్లా పరిషత్ స్కూల్, బైరాగి పట్టెడలోని రామానాయుడు మునిసిపల్ హై స్కూల్, ఎంఆర్ పల్లి జడ్పీ హైస్కూల్, రామచంద్రా లలో ఉన్న కౌంటర్లలో జారీ చేస్తున్నారు.ఇంకా చెప్పాలంటే జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను జారీ చేసే అవకాశం ఉంది.జనవరి ఒకటి మధ్యాహ్నం రెండు గంటల నుంచి టోకెన్లు పంపిణీ మొదలుపెడతారు.

Advertisement

నాలుగున్నర లక్షల కోట పూర్తయ్య వరకు నిరంతరంగా టోకెన్లను జారీ చేస్తామని తెలిపారు.టోకెన్లు ఉన్న భక్తుల్ని మాత్రమే తిరుమల క్యూ లైన్ లోకి అనుమతిస్తామని తిరుమల దేవస్థానం అధికారులు వెల్లడించారు.

క్యూ లైన్ లో వేచి ఉండే భక్తులకు టిఫిన్, అన్న ప్రసాదాలు, తాగునీరు, పాలు, టి వంటివి అందజేస్తారు.

Advertisement

తాజా వార్తలు