రికార్డు నెలకొల్పిన టీటీడీ..!

ఈ ప్రపంచంలో చాలా మంది ఎక్కువగా దర్శించుకోవాలనుకునే ఆలయాల్లో తిరుమల ముఖ్యమైనది.ప్రపంచ వ్యాప్తంగా కళియుగ వెంకటేశ్వరునికి భక్తులు చాలా మంది ఉన్నారు.

అంతేకాదు ప్రపంచంలోనే ఎక్కువ మంది దర్శించుకునే దేవాళయాల్లో తిరుమల మొదటి స్థానంలో ఉంది.తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచంలోనే అనేక చోట్ల తమ కార్యకలాపాలను నెలకొల్పేదిగా చరిత్రకెక్కింది.

ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ అరుదైన గుర్తింపు దక్కింది.ప్రపంచంలో ఏ ఆలయంలో లేనటువంటి సేవలు టీటీడీ తమ భక్తులకు అందిస్తోంది.

అందుకే టీటీడీకి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది.ఇంగ్లండ్ కు చెందినటువంటి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ కార్యదర్శులు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయిన వైవీ సుబ్బారెడ్డిని తిరుమలలో కలిసి ఈ విషయాన్ని తెలియజేశారు.

Advertisement
Ttd Got Placed In World Book Of Records For Its Unique Services, TTD, New Record

టీటీడీకి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం కల్పిస్తున్నట్టు ఓ ధ్రువీకరణ పత్రాన్ని కూడా వారు అందజేయడం జరిగింది.దీనికి వైవీ సుబ్బారెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.

ప్రపంచంలో మరే దేవస్థానంలో లేని విధంగా భక్తులకు సేవలు అందించడం గొప్ప విషయమన్నారు.మెరుగైన సదుపాయాలను భక్తులకు కల్పిస్తున్నామని, తమ పనితీరుకు విశిష్టంగా గుర్తింపు అనేది లభించిందని ఆయన తెలిపారు.

సాధారణంగా రోజుకు 60 వేల నుంచి 70 వేల మంది భక్తులకు ఏ మాత్రం అసౌకర్యం లేకుండా ఆ కళియుగ వైకుంఠవాసుని దర్శనాన్ని కల్పిస్తున్నామని తెలిపారు.

Ttd Got Placed In World Book Of Records For Its Unique Services, Ttd, New Record

శాస్త్రీయ విధానంలో క్యూలైన్లను ఏర్పాటు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నామన్నారు.రోజుకు 3.5 లక్షల లడ్డూలను తయారు చేసి భక్తులకు అందజేస్తున్నామని తెలిపారు.ఇటువంటి సేవలు చేసినందుకు టీటీడీకి గొప్ప గుర్తింపు లభించిందని వైవి సుబ్బారెడ్డి తెలిపారు.

వేస‌విలో అల్లాన్ని తీసుకోవ‌చ్చా..? ఖ‌చ్చితంగా తెలుసుకోండి!

భవిష్యత్తులో భక్తుల సౌకర్యార్థం అనేక సేవలను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు