ఫోటో కోసం ఏనుగు కాళ్ల కింద పడుకున్న మహిళ ఆ తరువాత ఏమైందంటే!

జనాలకు సెల్ఫీ పిచ్చి,ఫోటోల పిచ్చి ఎక్కువైపోయింది.

ఈ మధ్య ఎవ్వరిని చూస్తున్నా పిచ్చి గా ఫొటోలు ఎక్కడ బడితే అక్కడ దిగుతూ తమ సోషల్ మీడియా లో పోస్ట్ లు చేసుకోవడమే పెద్ద పనైపోయింది.

అయితే దీనికి యూత్ అనే కాదు ఎవరైనా కూడా ఈ ఫోటో పిచ్చి తో ఎక్కడపడితే అక్కడ ఫోటోలు దిగుతున్నారు.ఇలానే ఒక మహిళా భక్తురాలు ఫోటో దిగాలని అనుకుంది.

అనుకున్నదే తడవుగా అక్కడ ఉన్న ఒక ఏనుగు విగ్రహం కాళ్ల కింద పడుకొని మరి ఫోటో దిగింది.అంతా బాగానే ఉంది, మంచి మంచి ఫోజులు ఇచ్చి ఫోటో అయితే దిగింది కానీ ఆ తరువాతే అసలు కష్టం మొదలైంది.

దూరడం అయితే దూరి పోయింది కానీ ఆ సందులో నుంచి బయటపడడానికి మాత్రం నానా కష్టాలు పడింది.ఈ ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.

Advertisement

వివరాల్లోకి వెళితే.గుజరాత్ లో గుడికి వెళ్లిన ఒక మహిళా భక్తురాలు ఫోటో దిగాలి అన్న ఆత్రం తో అక్కడ కనిపించిన ఏనుగు విగ్రహాన్ని చూసి ముచ్చటపడి దాని కాళ్ల మధ్యలో దూరి మరీ ఫోటో కి ఫోజు ఇచ్చింది.

ఫోజులు బాగానే ఇచ్చింది కానీ తీరా బయటకు వద్దాం అని అనుకున్నప్పటికీ ఆమె బయటకు రాలేక నానా తిప్పలు పడింది.దీనితో అక్కడ మరి కొందరు మహిళలు ప్రయత్నించి నప్పటికీ ఆమె మాత్రం బయటపడడానికి నానా తిప్పలు పడి చివరికి ఎలానో అతి కష్టం మీద బయటపడి ఊపిరి పీల్చుకుంది.

నిజంగా ఫోటో లు దిగొచ్చు కానీ మరి ఇంతలా చిన్న చిన్న సందుల్లో దూరి కూడా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ఎన్ని ఇబ్బందులకు గురిచేస్తుంది ఈ తాజా ఉదంతం తో అర్ధం అవుతుంది.ఇక ఆ మహిళ మరోసారి ఇలాంటి ఫోటో లకు మాత్రం ఫోజు ఇవ్వదు ఎందుకంటే సీన్ రివర్స్ అవుతుంది అన్న విషయం అర్ధం అవుతుంది.

ఆ నటుడు ఒక్క డైలాగ్ లోని పదానికి పారితోషికం 15 లక్షలట
Advertisement