ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ కాసేపట్లో టీఎస్ గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్..!

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కలిశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితాను సీఈఓ వికాస్ రాజ్ అందించారు.

ఈ క్రమంలో ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ కాసేపట్లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.మరోవైపు రాత్రి 8.15 గంటలకు రాజ్ భవన్ లో తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది.అలాగే డిప్యూటీ సీఎంలుగా సీతక్క, భట్టి విక్రమార్క కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం.

ఇందుకోసం రాజ్ భవన్ లోని దర్బార్ హాల్ లో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు