Thick Hair : ఎన్ని చేసినా మీ పల్చటి జుట్టు ఒత్తుగా మారడం లేదా.. అయితే మీరీ ఆయిల్ వాడాల్సిందే!

సాధారణంగా కొందరి జుట్టు( Hair ) చాలా అంటే చాలా పల్చగా ఉంటుంది.అందాన్ని పెంచే వాటిలో జుట్టు ఒకటి.

కానీ ఆ జుట్టే పల్చగా ఉంటే ఏమాత్రం అట్రాక్టివ్ గా కనిపించలేరు.పైగా పల్చటి జుట్టు( Thin Hair ) వల్ల ఎటువంటి హెయిర్ స్టైల్స్ వేసుకోవడం కుదరదు.

ఈ క్రమంలోనే పల్చటి జుట్టును ఒత్తుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? కానీ ఎన్ని చేసిన మీ పల్చటి జుట్టు ఒత్తుగా మారడం లేదా.? అయితే ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ మీకు ఎంత ఉత్తమంగా సహాయపడుతుంది.కేవలం వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను ( Oil ) వాడారంటే ఎంతటి పల్చటి జుట్టు అయినా సరే ఒత్తుగా తయారవుతుంది.

మరి ఇంతకీ ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు,( Flax Seeds ) నాలుగు రెబ్బలు కరివేపాకు( Curry Leaves ) వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు కొబ్బరి నూనె, ఒక కప్పు ఆవ నూనె వేసుకోవాలి.అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న అవిసె గింజలు మరియు వేపాకు పొడిని వేసి చిన్న మంటపై ఉడికించాలి.

దాదాపు 15 నిమిషాల పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

ఆపై స్టైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని చల్లార బెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ ను స్కాల్ప్ కు( Scalp ) పట్టించి కనీసం పది నిమిషాల పాటు బాగా వేళ్ళతో మసాజ్ చేసుకోవాలి.

ఆయిల్ అప్లై చేసుకున్న మరుసటి రోజు లేదా నాలుగు గంటల అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

వారానికి రెండు సార్లు ఈ నూనెను తలకు రాసుకుంటే జుట్టుకు చక్కని పోషణ అందుతుంది.హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.దాంతో పల్చటి జుట్టు ఒత్తుగా మారుతుంది.

Advertisement

అలాగే ఈ ఆయిల్ ను వాడటం వల్ల జుట్టు రాలడం సైతం క్రమంగా తగ్గిపోతుంది.కాబట్టి ఒత్తైన కురులను కోరుకునేవారు తప్పక ఈ ఆయిల్ ను ట్రై చేయండి.

తాజా వార్తలు