ముడతలను తరిమికొట్టే మిరాకిల్ క్రీమ్ ఇది.. రోజు వాడితే 40 లోనూ 20లా కనిపిస్తారు!

ముడతలు వృద్ధాప్యానికి సంకేతం.వయసు పైబడే కొద్ది కండరాలు పటుత్వాన్ని కోల్పోవడం వల్ల ముడతలు( Wrinkles ) రావడం సర్వ సాధారణం.

కానీ ఇటీవల కాలంలో చాలా మంది తక్కువ వయసులోనే ముడతల సమస్యను ఫేస్ చేస్తున్నారు.అయితే ఇందుకు కారణం ఏదైనప్పటికీ ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ క్రీమ్ మీ యవ్వనాన్ని మళ్లీ తిరిగి తెస్తుంది.

ముడతలను తరిమి తరిమి కొడుతుంది.ఈ క్రీమ్ ని రోజు వాడితే 40 లోనూ 20 లా కనిపిస్తారు.

మరి ఇంతకీ ఆ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Try This Natural Cream To Get Rid Of Wrinkles Natural Cream, Wrinkles, Wrinkles
Advertisement
Try This Natural Cream To Get Rid Of Wrinkles! Natural Cream, Wrinkles, Wrinkles

ముందుగా వాటర్ లో అవిసె గింజలు( Flax seeds ) వేసి ఉడికించి జెల్ తయారు చేసి పెట్టుకోవాలి.ఆ తర్వాత ఒక కలబంద ఆకుని తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పల్చటి వస్త్రం సహాయంతో జ్యూస్ సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో అలోవెరా జ్యూస్( Aloe vera juice ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్( Corn flour ) వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.

Try This Natural Cream To Get Rid Of Wrinkles Natural Cream, Wrinkles, Wrinkles

ఆపై ఈ మిశ్రమాన్ని స్టవ్ పై పెట్టి దగ్గర పడేంత వరకు ఉడికించాలి.క్రీమీ స్ట్రక్చర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి.చల్లారిన తర్వాత ఈ మిశ్రమంలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న అవిసె గింజల జెల్, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

తద్వారా మన క్రీమ్ రెడీ అవుతుంది.ఈ క్రీమ్ ను నైట్ నిద్రించడానికి ముందు ముఖానికి, మెడకు అప్లై చేసుకోవాలి.రోజు ఈ విధంగా కనుక చేస్తే చర్మం పై ఎలాంటి ముడతలు ఉన్నా మాయమవుతాయి.

సెన్సార్ పూర్తి చేసుకున్న నాని హిట్3 మూవీ.. ఆ సీన్లను కట్ చేశారా?
నితిన్ మార్కెట్ భారీగా పడిపోయిందా..? రాబిన్ హుడ్ డిజాస్టర్ అయిందా..?

స్కిన్ టైట్ గా, బ్రైట్ గా మారుతుంది.మళ్లీ మీ చర్మం యవ్వనంగా మెరుస్తుంది.

Advertisement

తాజా వార్తలు