Diabetes : సహజంగానే షుగర్ ను కంట్రోల్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇది తప్పక తెలుసుకోండి!

ప్రస్తుత రోజుల్లో మధుమేహం( Diabetes ) వ్యాధిగ్రస్తులు అంతకంతకు పెరిగిపోతున్నారు.వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఏడాది ఎంతో మంది మధుమేహం బారిన పడుతున్నారు.

అయితే మధుమేహం ఉన్నవారికి షుగర్ ను కంట్రోల్ చేసుకోవడం ఎంతో కష్టతరంగా మారుతుంటుంది.ముఖ్యంగా షుగర్ లెవెల్స్ చాలా హైగా ఉన్నవారు మందులు వాడుతూనే.

కొన్ని ఇంటి చిట్కాలు కూడా ప్రయత్నిస్తుంటారు.అయితే సహజంగా షుగర్ ను కంట్రోల్ చేసుకోవాలని భావిస్తున్న వారికి ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది.

నిత్యం ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే షుగర్ ఎల్లప్పుడూ కంట్రోల్‌లో ఉంటుంది.మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బాటిల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్(Chia seed ) వేసుకోవాలి.

Advertisement

అలాగే రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్, పావు టేబుల్ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి( Cinnamon ) వేసుకోవాలి.

అలాగే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని పోసి మూత పెట్టి పావుగంట పాటు వదిలేయాలి.ఆపై బాటిల్ ను రెండు విషయాల పాటు బాగా షేక్‌ చేస్తే మన డ్రింక్ సిద్ధం అయినట్లే.ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి.

చియా సీట్స్, పసుపు, దాల్చిన చెక్క‌ మరియు నిమ్మరసంలో ఉండే పోషకాలు సహజంగానే రక్తంలోని చక్కెర స్థాయిల‌ను నియంత్రిస్తాయి.ఎంతో సమర్థవంతంగా షుగర్ లెవెల్స్ ను అదుపులోకి తెస్తాయి.

మధుమేహం ఉన్నవారికి ఈ పానీయం చాలా మేలు చేస్తుంది.అలాగే ఈ డ్రింక్‌ను నిత్యం తీసుకోవడం వల్ల అధిక బ‌రువు సమస్య నుంచి బయటపడతారు.

వైయస్సార్ బీమా పథకం పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం..!!
మీరు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోండి..

పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు మొత్తం క్రమంగా కరిగిపోతుంది.ఈ డ్రింక్ గుండె జబ్బులు వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది.

Advertisement

జీర్ణ సంబంధిత సమస్యల నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది.మలబద్ధకం స‌మ‌స్య ఉన్నా కూడా ప‌రార్ అవుతుంది.

తాజా వార్తలు