ముఖంలో అట్రాక్టివ్ గా కనిపించే భాగాల్లో పెదాలు ఒకటి.
ముఖ్యంగా పింక్ గ్లోయింగ్ లిప్స్( Pink Glowing Lips ) మన అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయి.
అందుకే అటువంటి పెదాల కోసం ప్రతి ఒక్కరు ఆరాటపడుతుంటారు.ప్రస్తుతం మనకు రకరకాల కలర్స్, ఫ్లవర్స్ తో లిడ్ స్టిక్స్ అందుబాటులోకి వచ్చాయి.
కానీ కృత్రిమ రంగులపై ఆధారపడకుండా సహజంగా కూడా పింక్ లిప్స్ ను పొందవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ లిప్ బామ్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.
ఈ లిప్ బామ్( Lip Balm ) ను రెగ్యులర్ గా వాడితే మీ పెదాలు పింక్ కలర్ లో అందంగా మెరిసిపోవడం ఖాయం.మరి ఇంతకీ ఆ లిప్ బామ్ ను ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో అర కప్పు బీట్ రూట్ ముక్కలు( Beetroot ), నాలుగు స్పూన్లు దానిమ్మ గింజలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు వాసెలిన్ వేసుకోవాలి.
అలాగే మూడు టేబుల్ స్పూన్లు దానిమ్మ( Pomegranate ), బీట్ రూట్ జ్యూస్ వేసుకోవాలి.మరియు రెండు చుక్కలు బాదం ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
తద్వారా మన లిప్ బామ్ సిద్ధం అవుతుంది.ఈ లిప్ బామ్ ను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు.
రోజుకు కనీసం రెండుసార్లు ఈ లిప్ బామ్ ను వాడితే బెటర్ రిజల్ట్ ను మీరు గమనిస్తారు.దానిమ్మ, బీట్ రూట్ పెదాలను పింక్ కలర్( Pink Lips ) లోకి మార్చడానికి గ్రేట్ గా హెల్ప్ చేస్తాయి.అలాగే వాసెలిన్, బాదం నూనె పెదాలను తేమగా, మృదువుగా ఉంచుతాయి.
అందంగా మెరిపిస్తాయి.కాబట్టి పింక్ లిప్స్ ను కోరుకునేవారు తప్పకుండా ఈ లిప్ బామ్ ను వాడెందుకు ప్రయత్నించండి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy