బీట్ రూట్ ఆరోగ్యానికే కాదు జుట్టు రాలడాన్ని కూడా అడ్డుకుంటుంది.. ఎలా వాడాలంటే?

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే దుంపల్లో బీట్ రూట్( Beetroot ) ఒకటి.

అనేక రకాల విటమిన్స్, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ తో బీట్ రూట్ లోడ్ చేయబడి ఉంటుంది.

అందువల్ల ఆరోగ్యపరంగా బీట్ రూట్ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టు రాలడాన్ని అడ్డుకోవడానికి కూడా బీట్ రూట్ సహాయపడుతుంది.

మరి ఇంతకీ జుట్టు( Hair )కు బీట్ రూట్ ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Try This Beetroot Oil To Stop Hair Fall, Stop Hair Fall, Hair Fall, Beetroot Oi

ముందుగా ఒక బీట్ రూట్ తీసుకుని తొక్క తొలగించి సన్నగా తురుముకోవాలి.ఈ తురుమును పూర్తిగా ఎండబెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ కొబ్బరి నూనె( Coconut Oil ) వేసుకోవాలి.

Advertisement
Try This Beetroot Oil To Stop Hair Fall!, Stop Hair Fall, Hair Fall, Beetroot Oi

అలాగే రెండు టేబుల్ స్పూన్లు మెంతులు, పది లవంగాలు, మూడు నుంచి నాలుగు రెబ్బలు కరివేపాకు మరియు బీట్ రూట్ తురుము వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉడికించాలి.దాదాపు పది నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్ట‌వ్‌ ఆఫ్ చేసుకోవాలి.

స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.

Try This Beetroot Oil To Stop Hair Fall, Stop Hair Fall, Hair Fall, Beetroot Oi

నైట్ నిద్రించే ముందు ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి.మరుసటి రోజు తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను కనుక వాడారంటే హెయిర్ ఫాల్( Hair Fall ) అన్న మాటే అనరు.

ఈ ఆయిల్ జుట్టును మూలాల నుంచి దృఢంగా మారుస్తుంది.హెయిర్ ఫాల్ ను సమర్థవంతంగా అరికడుతుంది.అలాగే హెయిర్ గ్రోత్( Hair Growth ) ను ప్రమోట్ చేస్తుంది.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

జుట్టు ఒత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది.కాబట్టి జుట్టు అధికంగా రాలిపోతుంద‌ని బాధపడుతున్న వారు తప్పకుండా ఈ బీట్ రూట్ ఆయిల్ ను ప్రయత్నించండి.

Advertisement

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

తాజా వార్తలు