కాంతివంతమైన చర్మం కోసం ఖర్జూరం.. ఇలా ముఖానికి రాస్తే మెరిసిపోవడం ఖాయం!

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రుచికరమైన మరియు మధురమైన ఫ్రూట్స్ లో ఖర్జూరం ఒకటి.

ఖర్జూరం( Date palm )లో అనేక రకాల విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

రోజుకు రెండు లేదా మూడు ఖర్జూరం పండ్లను తినడం వల్ల రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది.ఎముకలు దృఢంగా మారతాయి.

రక్తహీనత బారిన పడకుండా ఉంటారు.గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రయోజనాలు పొందుతారు.అలాగే చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కూడా ఖర్జూరం తోడ్పడుతుంది.

Advertisement
Try These Packs With Dates For Glowing And Beautiful Skin! Glowing Skin, Beautif

ఇప్పుడు చెప్పబోయే విధంగా ఖర్జూరాన్ని వాడితే సహజంగానే మీ చర్మం అందంగా కాంతివంతంగా మెరిసిపోతుంది.

Try These Packs With Dates For Glowing And Beautiful Skin Glowing Skin, Beautif

ఒక బౌల్ తీసుకొని అందులో మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు మరియు అరకప్పు ఫ్రెష్ కొబ్బరిపాలు పోసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత కొబ్బరి పాల( Coconut Milk )తో సహా ఖర్జూరాన్ని స్మూత్ గా గ్రైండ్ చేసుకుని కొంచెం తేనె కలిపి ముఖానికి మెడకు అప్లై చేసుకోవాలి 20 నిమిషాల తర్వాత వాటర్ తో కడిగేయాలి.ఈ సింపుల్ రెమెడీని ఫాలో అవ్వడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

డ్రై స్కిన్ సమస్య దూరం అవుతుంది.ముడతలు ఏమైనా ఉంటే తగ్గు ముఖం పడతాయి.

Try These Packs With Dates For Glowing And Beautiful Skin Glowing Skin, Beautif

అలాగే స్కిన్ వైట్నింగ్ కోసం ఆరాటపడేవారు రెండు టేబుల్ స్పూన్ల ఖర్జూరం పేస్ట్ లో వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి, చిటికెడు ఆర్గానిక్ పసుపు మరియు రోజ్‌ వాటర్ మిక్స్ చేసి ముఖానికి పూతల వేసుకోవాలి.పూర్తిగా ఆరిన తర్వాత కడిగేయాలి.రెండు రోజులకు ఒకసారి ఇలా చేస్తే స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది.ఇక మొండి మచ్చల నివారణ కోసం రెండు టేబుల్ స్పూన్ల ఖర్జూరం వేస్ట్ లో రెండు టేబుల్ స్పూన్లు టమాటో ప్యూరీ వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి.15 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి.ఈ సింపుల్ రెమెడీని తరచూ ఫాలో అయితే ముఖంపై ఎలాంటి మచ్చలు ఉన్నా మాయమవుతాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

మొటిమల సమస్య త‌గ్గుముఖం పడుతుంది.స్కిన్ టైట్ గా మరియు గ్లోయింగ్ గా మారుతుంది.

Advertisement

తాజా వార్తలు