ముల్తానీ మెరుపు.. ముఖానికి ఇలా పూశారంటే మచ్చల నుంచి ముడతలు వరకు అన్నీ మాయం!

ముల్తానీ మట్టి( Multani mitti ).దీనిని ఫుల్లర్స్ ఎర్త్ అని కూడా పిలుస్తారు.

ముల్తానీ మట్టి యొక్క మూలం ముల్తాన్ పాకిస్తాన్.చాలా సంవత్సరాలుగా భారతదేశానికి దిగుమతి అవుతున్న ముల్తానీ మట్టి సహజ చర్మ సంరక్షణ ఉత్పత్తిగా ప్ర‌సిద్ధి చెందింది.

బంకమట్టిని పోలి ఉండే ముల్తానీ మ‌ట్టి చర్మానికి ఎంతో అనుకూలమైనది.అనేక చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టే సామ‌ర్థ్యం ముల్తానీకి ఉంది.

జిడ్డుగల చర్మం మరియు మొటిమల చికిత్సలో ప్రభావవంతంగా ఉంటుంది.మచ్చ‌ల‌ను, ముడ‌త‌ల‌ను వ‌దిలించ‌డానికి అద్భుతంగా తోడ్ప‌డుతుంది.

Advertisement

ఈ నేప‌థ్యంలోనే ముల్తానీ మ‌ట్టిని చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించ‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి, వన్ టేబుల్ స్పూన్ శనగ పిండి, రెండు టేబుల్ స్పూన్లు కీర దోసకాయ ( Cucumber )తురుము మరియు రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని ప‌దిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.

ముల్తానీ ప్యాక్ వ‌ల్ల చ‌ర్మం లోతుగా శుభ్రం అవుతుంది.ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

మొండి మచ్చ‌లు క్ర‌మంగా మాయం అవుతాయి.చ‌ర్మ ఛాయ మెరుగుప‌డుతుంది.

ఉల్లి తొక్కలతో ఊడిపోయే జుట్టుకు ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసా?

అలాగే ముడ‌త‌లు, జిడ్డు చ‌ర్మంతో బాధ‌పడుతున్న వారు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి, రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్( Rose water ) వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత అందులో ఒక ఎగ్ వైట్ వేసి బాగా కలిపి ముఖానికి పూత‌లా అప్లై చేసుకోవాలి.ఇర‌వై నిమిషాల అనంత‌రం వాట‌ర్ తో వాష్ చేసుకోవాలి.

Advertisement

ఈ విధంగా క‌నుక చేశారంటే చ‌ర్మంపై అధిక ఆయిల్ ఉత్ప‌త్తి త‌గ్గుతుంది.స్కిన్ స్మూత్ అవుతుంది.

అదే స‌మ‌యంలో ముడ‌త‌లు త‌గ్గి చ‌ర్మం టైట్ గా సైతం మారుతుంది.

తాజా వార్తలు