కంగారు పెట్టిస్తున్న కారు... ఆపరేషన్ ఆకర్ష్ తో టీఆర్ఎస్ స్కెచ్ !

తెలంగాణాలో తిరుగులేని పార్టీగా జెండా ఎగురవేసేందుకు టీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది.

అసలే ముందస్తు ఎన్నికల సంకేతాలు అందుకున్న ఆ పార్టీ అధినేత కేసీఆర్ కారు స్పీడ్ పెంచే పనిలో పడ్డారు.

అందుకే ప్రతిపక్ష పార్టీల్లో బలమైన అభ్యర్థులను గుర్తించి వారిని టీఆర్ఎస్ లో చేరేలా ఆపరేషన్ ఆకర్ష్ పధకానికి కేసీఆర్ వ్యూహరచన చేసాడు.దీనిలో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్ లో బలమైన నేతగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు దానం నాగేంద్ర ను కారెక్కించుకున్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో విపక్షాల్లోని బలమైన నేతలను తన పార్టీలో చేసుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.ఎన్నికల వేళ ప్రతిపక్షాలను కంగారు పెట్టించేలా వ్యూహాలు రచిస్తోంది.ఇప్పటికే టీడీపీని ఆపరేషన్‌ ఆకర్ష్‌తో తీవ్రంగా దెబ్బతీయగా.

ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీపై టీఆర్‌ఎస్‌ బాస్‌ దృష్టి సారించారు.కాంగ్రెస్‌లో బలమైన నేతలుగా గుర్తింపు పొందిన నేతలపైనే టీఆర్‌ఎస్‌ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.

Advertisement

సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు అయినా.మాజీలు అయినా.

కారెక్కితే వారు కోరుకున్న స్థానాలను కేటాయిస్తామన్న హామీలు ఇస్తోంది.బలమైన నేతలుగా గుర్తింపు పొంది పార్టీలో సరైన ప్రాధాన్యత లేదని అసంతృప్తితో ఉన్న నేతలపై ముందుగా ద్రుష్టి పెట్టారు.

దీనిలో భాగంగానే.కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కారెక్కుతారన్న ప్రచారం అధికారపార్టీలో జరుగుతోంది.

ఓవైపు రాజకీయంగా బలమైన నేతలను కారెక్కించుకుంటూనే.మరోవైపు కాంగ్రెస్‌పై విమర్శల దాడిని అధికారపార్టీ నేతలు పెంచుతున్నారు.

దీంతో పాటు ప్రజా సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు చేస్తూ రాజకీయంగా ఎదురే లేకుండా చూసుకోవాలని టీఆర్ఎస్ చూస్తోంది.ఆపరేషన్ ఆకర్ష్ వ్యూహంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తుండడంతో టీఅర్ఎస్ నేతలు ఎదురుదాడి ప్రారంభించారు.

Advertisement

తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో నేతలు చేరుతున్నారని ఎంపీ కవిత అంటున్నారు.Click here to Reply or Forward.

తాజా వార్తలు