వైసీపీ నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్

ఏపీ విభజనపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.వైసీపీ నేతలు విషపు ఆలోచనలతో మాట్లాడుతున్నారన్నారు.

రాష్ట్ర విభజనను వెనక్కి తీసుకోవాలని అంటున్నారని విమర్శించారు.విభజన అసంబద్ధమని మాట్లాడటం దుర్మార్గమని పేర్కొన్నారు.వైసీపీ నేతల వ్యాఖ్యల వెనుక ప్రధాని మోదీ కుట్ర ఉందని ఆరోపించారు.2014లో మోదీ -చంద్రబాబు కలిసి ఏడు మండలాలను లాక్కున్నారని మండిపడ్డారు.బీజేపీకి చేతకావడం లేదని కేఏ పాల్, షర్మిలను తెరపైకి తెచ్చారని వెల్లడించారు.

TRS MLC Palla Rajeshwar Reddy Fires On YCP Leaders-వైసీపీ నేత�

ఎన్ని కూటములు వచ్చిన తమ ట్యాగ్ లైన్ తప్పలేదని తెలిపారు.నీళ్లు, నిధులు, నియామకాలపై టీఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కి పోలేదని స్పష్టం చేశారు.

మీ గోర్లు పొడుగ్గా దృఢంగా పెరగాలా.. అయితే ఈ చిట్కాలను మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు