మావోల టార్గెట్‎గా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..!

తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మావోయిస్టులు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

ముగ్గురు ఎమ్మెల్యేలు టార్గెట్ గా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెక్కీ నిర్వహించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.

టైం బాంబ్ తరహా పేలుళ్లకు వ్యూహారచన చేసినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టారు.

అదేవిధంగా శాసనసభ సభ్యులు బాల్క సుమన్, కోరుకంటి చందర్, దుర్గం చిన్నయ్యలు మావోల టార్గెట్ అయిన క్రమంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?
Advertisement