రేవంత్ ఆరోప‌ణ‌ల‌తో ఇర‌కాటంలో ప‌డ్డ టీఆర్ ఎస్‌.. అంతా చెప్పిన‌ట్టు గానే..?

ఇప్పుడు తెలంగాణ‌లో ధాన్యం కొనుగోలు మీద పెద్ద గంద‌ర‌గోళం నెల‌కొంది.అటు టీఆర్ఎస్ ఇటు బీజేపీ ఈ విష‌యం మీద మాట‌ల తూటాలు పేల్చుతున్నాయి.

కేంద్రం కావాల‌నే తెలంగాణ‌లో పండిన ధాన్యాన్ని కొన‌ట్లేద‌ని కేసీఆర్ విమ‌ర్శిస్తున్నారు.ఇంకో వైపు టీఆర్ఎస్ బాయిల్డ్ రైస్ ఇవ్వ‌బోమ‌ని లెట‌ర్ రాసి ఇచ్చింద‌ని బీజేపీ విమ‌ర్శిస్తోంది.

ఈ రెండు పార్టీల వైఖ‌రి వ‌ల్ల అటు రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు.అయితే ఇప్పుడు పార్ల‌మెంటు స‌మావేశాల్లో ఈ విష‌యం మీద టీఆర్ఎస్ ఎంపీలు నిర‌స‌న కూడా వ్య‌క్తం చేస్తున్నారు.

ఇంకోవైపు తాము పార్లమెంటు స‌మావేశాల‌ను బ‌హిష్క‌రిస్తున్నామ‌ని ప్ర‌క‌టించేశారు.అయితే ఈ చ‌ర్య‌ల మీద రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

Advertisement
TRS In Conflict With Revanth Allegations Like Everything Said TRS, Revanth, Bjp

కావాల‌నే టీఆర్ఎస్ నాట‌కం ఆడుతోంద‌ని, అస‌లు ప్లాన్ వేరే ఉంద‌ని తెలిపింది.రైతుల కోసం పార్లమెంటు స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించ‌లేద‌ని, దీని వెన‌క ఈడీ హెచ్చరికలు ఉన్నట్టు బాంబు పేల్చారు.

టీఆర్ఎస్‌కు ముందు నుంచే బీజేపీతో ఒప్పందం కుదిరింద‌ని ఇందులో భాగంగానే ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని వెల్ల‌డించారు.మంత్రి కేటీఆర్ మీద ఉన్న భూ కుంభ కోణంలో నోటీసులు జారీ అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్టు రేవంత్ చెప్పారు.

Trs In Conflict With Revanth Allegations Like Everything Said Trs, Revanth, Bjp

పార్ల‌మెంటులో స‌మావేశాలు స‌జావుగా సాగేందుకు వీలుగా టీఆర్ఎస్ ఎంపీలు సమావేశాలను బహిష్కరించారని రేవంత్ చెప్ప‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.అలాగే కేసీఆర్ స‌న్నిహిత సంస్థ‌కు ఇరిగేషన్ కాంట్రాక్టులు ఇవ్వ‌డం వెన‌క పెద్ద కుంభ‌కోణం ఉంద‌ని ఇందులో భాగంగానే ఈడీ నోటీసులు జారీ చేసే అవ‌కాశం ఉన్న‌ట్టు రేవంత్ ఆరోప‌ణలు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.కాగా రేవంత్ ఆరోప‌ణ‌లు చేయ‌డం ఇది మొద‌టిసారి కాదు.

కానీ ఇప్పుడు రేవంత్ చెప్పిన‌ట్టు టీఆర్ ఎస్ చేయ‌డం మాత్రం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!
Advertisement

తాజా వార్తలు