పాన్ ఇండియా మార్కెట్ ను క్రియేట్ చేసుకోలేకపోయిన త్రివిక్రమ్...కారణం ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి మొదట రైటర్ గా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను అందుకొని ఆ తర్వాత దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్.

( Trivikram Srinivas ) ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది.

ప్రతి చిన్న ఎపిసోడ్ ను కూడా తను భారీ లెవెల్లో చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు.మరి ఆ రకంగానే ప్రతి సినిమాలో తనను తాను ఎలివేట్ చేసుకోవడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు.

ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు సినిమా అవకాశాలను ఇచ్చే స్టార్ హీరో కరువయ్యారనే చెప్పాలి.ఎందుకంటే మహేష్ బాబుతో చేసిన గుంటూరు కారం( Gunturu Karam ) సినిమా భారీగా నిరాశపరచడంతో ఇప్పుడు ఆయన సినిమాలు చేయగలడా? లేదా అనే సందిగ్ధ పరిస్థితిలో ప్రస్తుతం ఉన్న హీరోలు ఉన్నారు.ఎందుకంటే హీరోల మార్కెట్ అనేది భారీగా పెరిగింది.

పాన్ ఇండియా సినిమాల( Pan India Movies ) మీదనే స్టార్ హీరోలు ఫోకస్ చేస్తున్నారు.కానీ త్రివిక్రమ్ మార్కెట్ మాత్రం తెలుగు వరకే పరిమితమవుతూ ఉంటాయి.

Advertisement

కాబట్టి సరిగ్గా డీల్ చేయగలడా లేదా అనే అనుమానంలో హీరోలు ఉన్నారు.ఇక త్రివిక్రమ్ ఇంతకుముందు పాన్ ఇండియా సినిమా చేయకపోవడమే దానికి కారణంగా చెప్పుకోవచ్చు.ఎందుకంటే ఆయన కనక పాన్ ఇండియా సినిమా చేసినట్లైతే ఆయనకు మార్కెట్ కూడా భారీగా ఏర్పడి ఉండేది.

దానివల్ల సినిమాకి హీరో పరంగా, డైరెక్టర్ పరంగా మార్కెట్ అనేది బాగా క్రియేట్ అవుతూ ఉంటుంది.కాకపోతే త్రివిక్రమ్ కి ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లేదు.

కాబట్టి ఆయన తెలుగు సినిమాలనే చేస్తాడా లేదంటే పాన్ ఇండియాలో మరిన్ని సబ్జెక్టులను ఎంచుకొని సినిమాగా చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 8, శుక్రవారం 2024
Advertisement

తాజా వార్తలు