Athadu movie : అతడు సినిమా వెనక మహేష్ బాబు త్రివిక్రమ్ మధ్య ఇంత జరిగిందా ?

మహేష్ బాబు( Mahesh babu ) మంచితనానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటాడు.

అతను చాలా గొప్పవాడని మంచివాడని తనతో కలిసి వర్క్ చేసిన నిర్మాతలు, దర్శకులు, యాక్టర్స్ కూడా తరచుగా చెప్తుంటారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా మహేష్ గురించి గొప్ప విషయాలు అప్పుడప్పుడు వెల్లడిస్తుంటాడు.తాజాగా త్రివిక్రమ్ మహేష్‌లోని మరో గొప్ప లక్షణాన్ని బయట పెట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సమంత హోస్ట్‌గా కండక్ట్ చేసిన ఒక ఇంటర్వ్యూలో దీనిని త్రివిక్రమ్‌ బయటపెట్టాడు.ఆ షోకి మహేష్ బాబు కూడా హాజరయ్యాడు.

ఈ ఇంటర్వ్యూలో మహేష్ బాబులో మీకు బాగా నచ్చింది ఏంటని సమంత అడగ్గా దానికి త్రివిక్రమ్ సమాధానం ఇస్తూ."నువ్వే నువ్వే (2002) సినిమా కంటే ముందే మహేష్ బాబుకి నేను అతడు (2005) కథ చెప్పాను.

Advertisement

ఆ సమయంలో ఒక్కడు సినిమా( Okkadu ) షూటింగ్ జరుగుతోంది.ఆ సినిమాలోని లాస్ట్ సాంగ్ పద్మాలయ స్టూడియోలో షూట్ చేస్తున్నారు.

" అని చెప్పాడు.అప్పుడు మహేష్ బాబు కలుగజేసుకొని "లేదు, ఒక్కడు సినిమా 2003లో వచ్చింది.

" అని త్రివిక్రమ్ ని కరెక్ట్ చేశాడు.దాంతో త్రివిక్రమ్ "అవునను, ఒక్కడు సినిమా స్టార్ట్ కావడానికి ముందు నేను మహేష్ బాబుని కలిశాను.

మురారి సినిమా జరుగుతున్నప్పుడు అనుకుంటా.పద్మాలయ స్టూడియోలో ఒక రూమ్‌లో కూర్చోబెట్టి మహేష్ బాబుకు కథ చెప్పా.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
టమాటాలు ఇలా తింటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే!!

ఆ తర్వాత ఏం సమాధానం చెప్పకుండా లేచి నడిచి వెళ్లిపోయాడు.నాకు ఏమైందో అర్థం కాలేదు.

Advertisement

అనంతరం మహేష్ బాబు వచ్చి మళ్లీ కూర్చున్నాడు.చాలాసేపు కూర్చున్నా, అందుకే కాసేపలా నడిచి వచ్చాను అని చెప్పాడు.

నేను ఆశ్చర్యపోయాను.తర్వాత ఈ సినిమా మనం చేస్తున్నామని మాట ఇచ్చాడు.

" అని చెప్పుకొచ్చాడు.

త్రివిక్రమ్ ఇంకా మాట్లాడుతూ( Trivikram )మహేష్‌కి అతడు కథ చెప్పిన సమయానికి నేను ఇంకా ఏ సినిమా డైరెక్ట్ చేయలే.ఒక దర్శకుడిగా నాకు ఏ అనుభవం లేదని తెలిసి కూడా మహేష్ నన్ను అంతలా నమ్మేశాడు.ముందుగా ఇచ్చిన నమ్మకాన్ని చివరి వరకి నాపై పెట్టుకున్నాడు.

నేను మధ్యలో స్రవంతి రవి కిషోర్ గారికి నువ్వే నువ్వే సినిమా చేయాలని చెప్పాను.అందుకు కూడా మహేష్ అభ్యంతరం చెప్పకుండా ఆ సినిమా చేసేయండి, వెయిట్ చేస్తానని అన్నాడు.

మహేష్ ఒక్కడు, అర్జున్ మూవీలు పూర్తి చేసిన తర్వాత నేను మూవీ మొదలు పెట్టాను కానీ మూవీ ముహూర్తం షూట్ కి మహేష్ బాబు రాలేదు.దాంతో నేను అనుమానపడ్డాను.

ఫోన్ చేసి మీరు ఈ సినిమాలో నటిస్తున్నారు కదా అని అడిగాను.నటిస్తున్నానని చెప్పాడు.

" అని చెప్పుకొచ్చాడు.

ఇంతలోనే మహేష్ బాబు అందుకొని ముహూర్తానికి రాకపోవడం నాకొక సెంటిమెంట్ అని చెప్పుకొచ్చాడు.దూకుడు మూవీ ముహూర్తానికి కూడా మహేష్ రాలేదని సమంత కూడా ఈ సెంటిమెంట్ గురించి తెలిపింది.చివరగా త్రివిక్రమ్ మాట్లాడుతూ "మహేష్ ఒకసారి నమ్మితే చివరి వరకు ఆ నమ్మకం అలాగే ఉంచుతాడు.

అందుకే నాకు అది నచ్చుతుంది." అని చెప్పాడు.

తాజా వార్తలు